క్రైమ్/లీగల్

ఆంధ్రా బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివపేట, అక్టోబర్ 1: జనసంచారం లేని సమయం చూసి ఏటీఎంలో చోరీకి నింధితుడు విఫలయత్నం చేసిన సంఘటన మండల పరిధిలోని నందికంది గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సదాశివపేట ఇన్స్‌పెక్టర్ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుర్తు తెలియని దుండగుడు ముఖాని జేబురుమాలు కట్టుకుని 65వ జాతీయ రహదారి ప్రక్కన ఏర్పాటు చేసిన ఆంధ్రా బ్యాంక్ ఏటీఎంలోకి చొరబడ్డాడు. ఏటీఎం పైకప్పును తెరిచేందుకు విఫలయత్నం చేసాడు. రాత్రి రెండు నుంచి మూడు గంటల మద్య నింధితుడు చోరీ ప్రయత్నం చేసినట్లు ఏటీఎం సీసీ పుటేజీల ద్వారా స్పష్టమవుతుందన్నారు. ఏటీఎంలో నిల్వ ఉంచిన రూ.7 లక్షలు సురక్షితంగా ఉన్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారన్నారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నింధితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తునట్లు సీఐ స్పష్టం చేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.