క్రైమ్/లీగల్

స్మగ్లర్లు రూటు మార్చినా... వెంటాడిన టాస్క్ఫోర్స్ సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 8: ఎర్రచందనం అక్రమరవాణాలో టాస్క్ఫోర్స్ సిబ్బంది కంటపడకుండా స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అనే్వషిస్తున్నా టాస్క్ఫోర్స్ మాత్రం వారిని వదిలిపెట్టడంలేదు. ఎప్పటికప్పుడు తాము కూడా స్మగ్లర్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారి ఆట కట్టిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్‌ఎస్‌ఐ వాసు ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది శ్రీవారి మెట్టు నుంచి కళ్యాణి డ్యాం వైపు వెళుతుండగా సోమవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఎర్రగుట్టల వద్ద స్మగ్లర్ల అడుగుజాడలను గుర్తించారు. వారి రాకకోసం టాస్క్ఫోర్సు సిబ్బంది బృందాలుగా విడిపోయి కాపుకాశారు. అయితే స్మగ్లర్లు తమ రూటుమార్చి చెకింగ్‌లేని ప్రాంతాల వైపు వెళ్లడం గమనించారు. దీనిని గుర్తించిన టాస్క్ఫోర్స్ సిబ్బంది మరో బృందాన్ని అప్రమత్తం చేశారు. వారిని గుర్తించిన స్మగ్లర్లు తమ వద్ద ఉన్న ఎర్రచందనం దుంగలను అక్కడే పడేసి రామిరెడ్డిగారి పల్లెవైపు పారిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న టాస్క్ఫోర్స్ అక్కడ పడివున్న 7 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. అలాగే డాగ్ స్క్వాడ్ సహాయంతో మరో రెండు దుంగలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొంత దూరంలో రెండు నెంబర్ ప్లేట్లు కలిగి ఉన్న మహేంద్రా ఎక్స్‌వైఎల్‌ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఎఫ్‌ఆర్వో లక్ష్మీపతి, ప్రసాద్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.