క్రైమ్/లీగల్

గంజాయి సాగుపై ప్రత్యేక నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* డోన్ కెమెరాలతో వ్యవసాయ క్షేత్రాల్లో పరిశీలన
* సమాచారం ఇచ్చిన వారికి రూ.10వేల నజరానా
* ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
-------------------------------------
సంగారెడ్డి టౌన్, అక్టోబర్ 8: జిల్లాలో అక్రమంగా కొనసాగిస్తున్న గంజాయి సాగుపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. గంజాయి మొక్కలను సాగు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో గంజాయి నిర్మూలన కోసం రూపొందించిన కరపత్రాన్ని ఎస్పీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి సాగు సమాచారం ఇచ్చిన వారికి రూ.10వేల నజరానా ఇవ్వనున్నట్లు తెలిపారు. బంతి మొక్కలా కనిపించే ఈ గంజాయిని కొంత మంది రైతులు కంది, ఇతర పంటల మధ్యలో సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఇలా సాగు చేస్తున్న వారుంటే వెంటనే 9440901824కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. గంజాయి సాగుపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేశామని, డోన్ కెమెరాల ద్వారా వ్యవసాయ క్షేత్రాల్లో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. యువత మాదకద్రవ్యాల భారిన పడి తమ విలువైన ఆరోగ్యం, జీవితాలను నాశనం చేసుకుంటున్న దృష్ట్యా జిల్లా పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎఎస్పీ మహేందర్, డీఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అల్లాదుర్గంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు
650 గంజాయి మొక్కలు స్వాధీనం, ధ్వంసం
అల్లాదుర్గం, అక్టోబర్ 8: పత్తి పంటలో అంతర్గత పంటలాగా గంజాయి మొక్కలు పెంచుతూ చివరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పక్కా సమాచారంతో దాడులు చేయడంతో ఈ గంజాయి మొక్కల గుట్టు బయటపడింది. అల్లాదుర్గం మండలంలోని రెండు గ్రామాల్లో మెదక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం మధ్యాహ్నాం గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేయగా చిల్వర్, రెడ్డిపల్లిలో పంట పొలాల్లో 650 గంజాయి మొక్కలు సాగుపై దాడులు జరిపారు. చిల్వర్ గ్రామంలోని చాకలి కిష్టయ్య పత్తి పంటలో 350 గంజాయి మొక్కలు, అదే గ్రామానికి చెందిన చాకలి లింగయ్య పత్తి పంటలో 230 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు మెదక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఈ మొక్కలను తగలబెట్టారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో బాన్సువాడ భూమయ్య పంట పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు తెలుసుకొని అక్కడ పత్తి పంటలో సోదా చేయగా 80 గంజాయి మొక్కలు దొరికినట్లు ఆయన తెలిపారు. వీటిని ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. గంజాయి మొక్కలు సాగు చేస్తున్న చాకలి కిష్టయ్య, చాకలి లింగయ్యతో పాటు బాన్సువాడ భూమయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
* గంజాయని సాగు చేస్తే కఠిన చర్యలు
అక్రమంగా గంజాయి మొక్కలను సాగు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ రమేశ్‌రెడ్డి హెచ్చరించారు. అల్లాదుర్గం మండలంలో ఇప్పటి వరకు రెండు గ్రామాల్లో దాడులు జరిపామని, మిగతా కొన్ని గ్రామాలపై తమ నిఘా ఉంచినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. ఈయన వెంట ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సైలు రాజు, విశ్వనాథం, హెడ్ కానిస్టేబుల్ అలీమ్, ఆజామ్, విఠల్, మాణిక్‌ప్రభు, పోలీస్ సిబ్బంది ఫరీద్, సతీష్, మోసిన్, మల్కయ్య, కరీమ్, సంధ్యలు ఉన్నారు.