క్రైమ్/లీగల్

రైల్వేస్టేషన్‌లో ఘోరం.. గొంతు కోసి వృద్ధుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు: తాండూరు రైల్వే స్టేషన్ మూడవ నెంబర్ ప్లాట్‌ఫారంపై గుర్తు తెలియని వృద్ధుడిని దారుణంగా గొంతు కోసి హతమార్చిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. తాండూరు రైల్వే పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం అర్థరాత్రి 1.39 నిముషాలకు కొల్లాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లాక సంఘటన జరిగినట్లు భావిస్తున్నారు. సుమారు 65 సంవత్సరాల వృద్ధుడిని గుర్తుతెలియని దుండగుడు గొంతు కోసి రైల్వే స్టేషన్ మూడవ నెంబర్ ప్లాట్‌ఫారంపై పడుకో బెట్టి పరారయ్యాడు. విజిటింగ్ కార్డు లభించిందని స్థానిక రైల్వే పోలీసులు సాయప్ప, వీరేశం, ఉపేందర్ తెలిపారు. విస్టింగ్ కార్డుపై రాజేష్ అనే పేరు ఉందని వివరించారు. విజిటింగ్ కార్డు వెనక భాగంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సెల్ నెంబర్ ఉంది. ఆ నెంబర్‌కు స్థానిక రైల్వే సోలీసులు ఫోన్ చేయగా స్పందించి ప్రాథమిక సమాచారం ఇచ్చాడు. రాజేష్ సైకో అని ఒంటరిగా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసుకొని, స్నేహం చేసి మద్యం సేవించి మాయమాటలు చెప్పి నిర్జన ప్రదేశాలకు తీసుకువెళ్లి డబ్బు, నగలు లాక్కోని హతమార్చుతాడని ఓర్వకల్లు పోలీసులు వ్లెడించారు. రాజేష్ ఫోన్ నెంబర్‌కు పోలీసులు ఫోన్ చేయగా వరంగల్ ఏరియాలోని సెల్ టవర్ పరిధిలో ఉన్నట్లు తెలుసింది. ఘటనా స్థలాన్ని సికిందరాబాద్ రైల్వే రూరల్ డీఎస్పీ శ్రీనివాస రావు, సీఐ వెంకట్ రాంనాయక్, ఎస్సై రాఘవేందర్, ఆర్పీఎఫ్ సీఐ సత్పాల్, ఎస్సై నజీర్ పరిశీలించారు.