క్రైమ్/లీగల్

అనుమానాస్పదస్థితిలో బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్ : మూడేళ్ల బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన మాదన్నపేట ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. బాలుడ్ని తల్లి చంపిందంటూ కన్నతండ్రి ఆరోపిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... మాదన్నపేట రామచంద్రాపురంలో నివసించే ముఖరం, నుస్రత్ దంపతులకు నలుగురు సంతానం. వారిలో ముగ్గురు ఆడపిల్లలు కాగా నాలుగో సంతానం రేయాన్(3). సోమవారం ఉదయం రేయాన్ ఇంటిలోని సంపులో పడి మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్ళి సంపులో పడి ఉంటాడని తల్లి నుస్రత్ చెపుతుండగా, తల్లే నామీద కోపంతో సంపులో పడేసిందని తండ్రి ముఖరం ఆరోపిస్తున్నాడు. ముఖరంకు వారి బంధువులలో ఒకరితో అక్రమ సంబంధం ఉందంటూ నుస్రత్ అతనితో తరుచూ గొడవపడేది. ఈ విషయమై కొంతకాలం క్రితం దక్షిణ మండల పోలీసులు దంపతులకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపినట్లు తెలుస్తుంది. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించామని రిపోర్టు వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.