క్రైమ్/లీగల్

అన్నను కత్తితో నరికిన తమ్ముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, అక్టోబర్ 8: మద్యం మత్తు, డబ్బు, కుటుంబ కలహాలు ప్రాణం మీదకు తెచ్చాయి. తాగిన మైకంలో తమను చంపుతాడేమోననే భయంతో తమ్ముడే అన్నను అంతమొందించాడు. ఈ దుర్ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మియాపూర్ ప్రాంతంలోని సుభాష్‌చంద్రబోస్ నగర్ బస్తీలో పత్లవత్ లక్ష్మణ్ తన భార్య, ముగ్గురు కొడుకులతో కలిసి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కొడుకు రామ్‌దాస్ (40) తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సమీపంలోని నడిగడ్డ తాండలో నివసిస్తున్నాడు. కాగా తల్లిదండ్రులు, తమ్ముళ్ళు నివసిస్తున్న సొంత ఇంటిని ఇటీవలే పెద్ద కొడుకు రామ్‌దాస్ రూ.15.75 లక్షలకు మల్లేష్ అనే వ్యక్తికి అమ్మేశాడు. బయానాగా తీసుకున్న రూ.4లక్షల్లో నుంచి కొంత మొత్తం అప్పులు కట్టడంతో ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని లేకుంటే చంపేస్తానంటూ తాగిన మైకంలో రామ్‌దాస్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నిజంగా చంపేస్తాడేమోనని ఆందోళనకు గురైన తమ్ముడు రవీందర్ (22), తన స్నేహితుడైన జెటావత్ సాయి (21)కి జరిగినదంతా చెప్పుకున్నాడు. అన్నను అంతమొందించాలని నిర్ణయించుకుని ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాగా తాగి మత్తుగా నిద్రిస్తున్న రామ్‌దాస్‌ను మిత్రుడు సాయితో కలిసి కత్తితో గొంతుకోశాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న రవీందర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నేరం అంగీకరించాడు. రవీందర్, సాయిని పోలీసులు రిమాండ్‌కు పంపించారు.