క్రైమ్/లీగల్

భూ తగాదాలతో తండ్రీ కొడుకుల దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డుంబ్రిగుడ, అక్టోబర్ 25: మండలంలోని కొర్రాయి పంచాయతీ కొట్టిగుడ గ్రామంలో తండ్రి కొడుకులు బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. భూ తగాదాల కారణంగా హత్య చేసిన వీరి మృతదేహాలను నిందితులు దహనం చేసి పరారయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం కొట్టిగుడ గ్రామానికి చెందిన గెమ్మెలి మోహనరావు (50) లీజుకు తీసుకున్న భూమిలో కొండచీపుర్లు పండించుకుంటుండగా పక్కనే ఉన్న భూమిలో ఉపాధి హామీ పథకం కింద చెరవు తవ్వకాలకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. దీంతో మోహనరావు అభ్యంతరం వ్యక్తం చేసి తాను పండిస్తున్న కొండచీపుర్లకు చెరువు తవ్వకాల వలన ఇబ్బందులు ఎదురౌతాయని, తన పంట ముగిసిన తరువాత చెరువు తవ్వకాలు చేసుకోవాలని కోరాడు. దీంతో గ్రామస్తులకు మోహనరావు మధ్య వివాదం నెలకొనగా బుధవారం సాయంత్రం గ్రామ పెద్ద ల సమక్షంలో ఈ తగాదా పరిష్కారానికి సమావేశం నిర్వహించారు. అయితే మోహనరావుకు ఆయన కుటుంభ సభ్యులకు మధ్య చాలా కాలంగా భూ తగాదాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మోహనరావు కుటుంభ సభ్యులైన గెమ్మెలి దొంబు, అర్జున్, త్రినాద్ ఈ సమావేశంలో మోహనరావును నిలదీసి తలభాగంపై కర్రలతో తీవ్రంగా కొట్టినట్టు చెబుతున్నారు. ఈ సంఘటనలో గాయపడిన మోహనరావును ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ఆయన పెద్ద కుమారుడు అప్పారావు ప్రయత్నించి మోటార్ బైకుపై తీసుకువెళుతుండగా దొంబు, అర్జున్, త్రినాధ్‌తో పాటు మరికొంత మంది గ్రామస్తులు అడ్డగించి తండ్రి కొడుకులను తీవ్రంగా కొట్టి హతమార్చారు. ఈ సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన మోహనరావు కుటుంభ సభ్యులపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించగా వారు భయాందోళలకు గురై పారిపోయినట్టు చెబుతున్నారు. అయితే మోహనరావు, అప్పారావులను హత్య చేసిన నిందితులు వీరి మృతదేహాలకు నిప్పు పెట్టి దహనం చేయడంతో ఇరువురి మృతదేహాలు కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన అనంతరం నిందితులు గ్రామం విడిచి పరారయ్యారు. ఈ విషయమై గ్రామస్తులు ఇచ్చిన పిర్యాదు మేరకు అరకులోయ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు గురువారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. జంట హత్యలకు సంబంధించిన వివరాలను ఆయన గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తండ్రీ కొడుకులను హత్య చేసి పరారయిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. భూ తగదాల కారణంగా కుటుంభ సభ్యులే మోహనరావు, అప్పారావులను హత్య చేసినట్టుగా ప్రాధమికంగా తెలుస్తోందని, దీనిపై సమగ్ర విచారణ చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.