క్రైమ్/లీగల్

గుంటలో పడి మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీమకుర్తి, అక్టోబర్ 25 : చీమకుర్తి మండలం రాజుపాలెం -లక్ష్మీపురం ఎస్‌సి కాలనీ వద్ద గుంటలో పడి చేవూరి రమణమ్మ (50) మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీపురానికి చెందిన రమణమ్మ ఎస్‌సి కాలనీలోని కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందింది. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ గరికపాటి వెంకటేశ్వరచౌదరి సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బాలలను కార్మికులుగా వినియోగించుకుంటే చట్టప్రకారం చర్యలు తప్పవు
* జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ ప్రియదర్శిని
ఒంగోలు, అక్టోబర్ 25: బాల్యం బడిలోనే ఉండాలి గాని, కార్ఖానాలలో, వీధిబాలలుగా ఉండటం చట్టరీత్యా నేమని, 14 సంవత్సరాలలోపు బాలలను బాల కార్మికులుగా వినియోగించుకుంటే అటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్ ఎంజి ప్రియదర్శిని పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ వారి సూచనల మేరకు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ, విద్యా శాఖ, పోలీస్, పానల్ లాయర్, జిల్లా బాలల సంక్షేమ కమిటీ, డీసీపీవో, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా కార్మిక శాఖ, ఛైల్డ్‌లైన్ -1098, హెల్ప్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లా కేంద్రమైన ఒంగోలులో బాల కార్మికుల నిర్మూలనకై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బాల కార్మికుల నిర్మూలనకు వివిధ షాపులు, రైల్వేష్టేషన్, బస్‌స్టాండ్, మెకానిక్ షెడ్లలో ఉదయం 8 గంటలకు రెండు బృందాలుగా విడిపోయి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 52 మంది బాలలకు విముక్తి కల్పించారు. వారందరినీ జిల్లా బాలల సంక్షేమ కమిటీ ముందు ప్రవేశపెట్టారు. వారి ఆదేశాల మేరకు 15 మంది పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించారు. 12 మంది షాపు యజమానులపై కార్మిక శాఖ వారు కేసులు నమోదు చేశారు. కొంతమంది బాలలను బాలల ఆశ్రమంలో చేర్పించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఆడుతూపాడుతూ పాఠశాలల్లో ఉండాల్సిన బాలలను ఆర్థికస్థితి బాగులేదనో, బాలల సంపాదనపై ఆధారపడి వారి ఉజ్వల భవిష్యత్తును ఎవరూ పాడుచేయవద్దని కోరారు. ప్రభుత్వం బాలల అభ్యున్నతి కోసం అనేక పథకాలు చేపడుతుందని, వాటిని సద్వినియోగం చేసుకొని సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని న్యాయమూర్తి కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి రాజావెంకటాద్రి మాట్లాడుతూ బాలలు పాఠశాలలోనే ఉండాలని, వారు అభివృద్ధి చెందాలని, సమాజంలో పనికివచ్చే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని, ఒక మంచి లక్ష్యంతో, బాల కార్మికవ్యవస్థను జిల్లా నుంచి పారద్రోలాలన్న ధృడ సంకల్పంతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. దీనికి ప్రభుత్వంలోని అన్ని శాఖల వారు కలసికట్టుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కెఆర్‌టి పాల్ మాట్లాడుతూ బాల కార్మికుల నిర్మూలన కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్మన్, సభ్యులు సిహెచ్ భారతి, బత్తుల పద్మావతి, బషీర్, డిసిపిఓ ఎన్ జ్యోతి సుప్రియ, పారాలీగల్ వాలంటీర్ బీవీ సాగర్, సిఐ మోయన్, కార్మికశాఖ అధికారులు టి మధుబాబు, యం ఎలిజిబెత్, పానల్ లాయర్లు సిహెచ్‌నాగరాజు, డి రాజేంద్ర ప్రసాద్, యన్ దేవకుమారి, డిప్యూటి ఇఓఎ దయానందం తదితరులు పాల్గొన్నారు.