క్రైమ్/లీగల్

పేలుడు పదార్ధాల రవాణా నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నిబంధనలు ఉల్లఘిస్తే మూడేళ్ళు జైలు
* ఫిర్యాదు కోసం హెల్ఫ్‌లైన్ 182
* వాల్తేరుడివిజన్ అధికారుల హెచ్చరిక
==========================
విశాఖపట్నం, అక్టోబర్ 29: రైళ్ళల్లో పేలుడు పదార్ధాలు తీసుకువెళ్ళడం, నిషేధిత వస్తు సామాగ్రి అక్రమ రవాణాకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరుడివిజన్ అధికారులు నిర్ణయించారు. ఎటువంటి పరిస్థితుల్లోను పేలుడు పదార్ధాలను అక్రమంగా తీసుకువెళ్ళడాన్ని గుర్తిస్తే ఇటువంటి వారిపై చట్టరీత్యా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఇది నేరమే అవుతుందని డివిజన్ అధికారులు పేర్కొన్నారు. దేశంలో పలుచోట్ల జరుగుతోన్న ప్రమాదపు సంఘటనలను దృష్టిలోపెట్టుకుని దీపావళి పండుగ సందర్భంగా కూడా బాణాసంచాను అక్రమంగా రవాణా చేసే అవకాశాలు ఉన్నందున ఇటువంటి వాటిని అరికట్టేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మెయిల్/ఎక్స్‌ప్రెస్‌లతోపాటు పాసింజర్ల రైళ్ళల్లో దిపావళి సామాగ్రిని రవాణా చేయడాన్ని పూర్తిగా నిషేధించినట్టు సంబంధితాధికారి ఒకరు తెలిపారు. నిషేధిత, పేలుడు సామాగ్రి, బాణాసంచా వంటివి రైలు ప్రయాణంలో కంట పడితే కఠినంగా వ్యవహించేందుకు వీలుగా ప్రత్యేగ నిఘా పెట్టడం కోసం స్పెషల్ స్క్వాడ్ పనిచేస్తుందన్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా బాణాసంచా, గ్యాస్ సిలిండర్, యాసిడ్, పెట్రోల్, కిరోసిన్ తదితర వాటిని ఎటువంటి పరిస్థితుల్లోనను రవాణా చేయరాదని ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జీ.సునీల్‌కుమార్ సోమవారం ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించేవారిపట్ల 1989 చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దీనికి మూడేళ్ళ వరకు జైలుశిక్ష ఉంటుందన్నారు. అందువల్ల రైలు ప్రయాణికులు దీనిని గమనించి తమ వెంట ఎటువంటి పేలుడు సామాగ్రిని, నిషేధిత సరుకులను వెంట తీసుకువెళ్ళరాదని, అలాగే తోటి ప్రయాణికులు దీనిపై అవగాహన కలిగి ఉండేవిధంగా తగిని సమాచారాన్ని చేరవేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అక్రమంగా పేలుడు సామాగ్రిని రవాణా చేస్తున్నట్టుగా కంటపడితే ప్రయాణికులు తమతో సహకరించాలని, ముఖ్యంగా ఈ ఇటువంటి సమాచారాన్ని రైల్వే టీటీఇలు, కోచ్ అటెండెట్లు, రైలు గార్డులు, స్టేషన్ మేనేజర్లు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్‌పీ)ల్లో ఎవరికైనా ఫిర్యాదు చేయవచ్చని తద్వారా ప్రయాణికులు ఎటువంటి ప్రమాదాలకు గురికాకుండా సుఖవంతమైన ప్రయాణం చేయవచ్చన్నారు. భద్రతా సిబ్బందికి సంబంధించి హెల్త్‌లైన్ నెంబర్ 182 ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. భద్రతపరమైన చర్యల్లో భాగంగా ప్రయాణికులను అప్రమత్తం చేయడం కోసం తరచూ స్టేషన్‌లో ఎంక్వైరీ ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు. వాల్తేరుడివిజన్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో తగిన జాగ్రత్తలు, సూచనలు చేస్తోందని, సబ్‌స్టేషన్ల సమీపంలో బాణాసంచాలు ఉంచినా, పేల్చినా ప్రమాదానికి గురికావాల్సి వస్తుందని, అందువల్ల అంతా మరింత అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.