క్రైమ్/లీగల్

మొక్కుల కోసం వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు.. హైవే 65పై రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగాల, ఆగస్టు 24: హైదరాబాద్ -విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై ఘెర రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం చెందగా మరో ఆరుగురికీ తీవ్ర గాయాలై సంఘటన మండల పరిధిలోని బరాఖాత్‌గూడెం గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని మీయాపూర్‌కు చెందిన చెన్నూపల్లి వీరభద్రాచార్యులు తన కుమారుడు చైతన్యకు ఇటీవల మలేషియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చినందుకు మొక్కులు తీర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవాలయానికి భార్య ఉమామహేశ్వరి, కుమారుడు చైతన్య, అల్లుడు అల్లూరి గోపిచంద్, కుమార్తె అల్లూరి పద్మలత, మనవరాళ్లు హర్షిత, సన్‌సీ, మనుమడు జీవన్‌లతో కలిసి టీఎస్ 07 ఎఫ్‌ఈ 2430 నెంబరు గల మహేంద్ర ఎక్స్‌యూవీ తమ సోంతకారులో గురువారం అర్ధరాత్రి హైదరాబాద్ నుండి బయలుదేరారు. అతివేగంగా వెళ్తున్న వీరి కారు బరాఖాత్‌గూడెం సమీపంలో అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి కుడివైపు రోడ్డుపైకి దూసుకెళ్లి 30మంది ప్రయాణీకులతో వైజాక్ నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న పీవై 01సికె 9569 నెంబరుగల కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు వోల్వో బస్సును ఎదురుగా వెళ్లి ఢీకొట్టింది. ఈప్రమాదంలో హైదరాబాద్‌లోని ఎస్‌కె నగర్‌కు చెందిన కారు డ్రైవర్ అత్తికొండ రాజు(40), వీరభద్రచార్యుల భార్య ఉమామహేశ్వరి (64)లు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని 1033 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అతివేగం, నిద్రమత్తు వల్లే ఈప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలకు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్షలు నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు మునగాల ఎస్‌ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.