క్రైమ్/లీగల్

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకుంటే చర్యలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, అక్టోబర్ 29 : అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రఖ్యాత గాంచిన పుట్టపర్తిలోని లాడ్జ్‌లు, అపార్ట్‌మెంట్‌ల నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకుంటే చర్యలు తప్పవని డీఎస్పీ రామవర్మ వారిని హెచ్చరించారు. సోమవారం పుట్టపర్తిలోని సాయిసదన్ గెస్ట్‌హౌస్ నందు లాడ్జిలు, అపార్ట్‌మెంట్, వ్యాపార సముదాయ నిర్వాహకులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమావర్మ మాట్లాడుతూ భగవాన్ సత్యసాయి బాబా దర్శనార్థం ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి వెళుతుంటారని, వారికి శాంతిభద్రతలు కల్పించడంలో పోలీసులు రాజీ లేని సౌకర్యాల కల్పనలో అందరికీ బాధ్యతలను తెలియజేయడం జరుగుతోందన్నారు. నవంబర్ 23వ తేదీన భగవాన్ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలను దృష్టిలో వుంచుకుని పుట్టపర్తిలోని వ్యాపార సముదాయ నిర్వాహకులకు తగిన సూచనలు, జాగ్రత్తలు తెలియజేయడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవడం ద్వారా అసాంఘిక శక్తులు, గుర్తుతెలియని వ్యక్తులను ముందస్తుగా గుర్తించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుందన్నారు. పోలీసులకు ప్రతి ఒక్కరూ తప్పక సహకరించాలన్నారు. లాడ్జ్‌లు, అపార్ట్‌మెంట్ నిర్వాహకులు ఇక్కడికి వసతి కోసం వచ్చే వారి నుంచి తప్పనిసరిగా గుర్తింపు కార్డులు స్వీకరించాలని ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందజేయాలన్నారు. అదేవిధంగా దుకాణాదారులు విక్రయించే వస్తువులు, తూనికలు సక్రమంగా పాటించాలని, బిల్లులు వినియోగదారులకు అందజేయాలని సూచించారు. పట్టణ ప్రధాన రహదారులలో పారిశుద్ధ్యం పాటించాలని, నిబంధనలు ఎవరు అతిక్రమించిన కఠిన చర్యలు తప్పవన్నారు.

బస్సు కింద పడి మహిళ మృతి

ఆత్మకూరు, అక్టోబర్ 29: ఆత్మకూరు స్టేట్ బ్యాంక్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శరణమ్మ (43) సోమవారం ఆర్టీసీ బస్సును దాటి ముందుకు వెళ్లే ప్రయత్నంలో బస్సు కిందపడి మరణించింది. ఈమె అనంతపురం నగరానికి చెందిన మదర్‌థెరిసా కాలనీ నివాసిగా పోలీసులు గుర్తించారు. ఈమె తన కుమారుడితో కలిసి అనంతపురం వెళ్లే ప్రయత్నంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స నిమిత్తం శరణమ్మను ఆత్మకూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇల్లూరులో ఇసుక డంప్ సీజ్

గార్లదినె్న, అక్టోబర్ 29: మండల పరిధిలోని ఇల్లూరు గ్రామ సమీపంలో ఇసుక డంప్ ఏర్పాటుచేసినట్లు సమాచారం రావడంతో సోమవారం తహశీల్దార్ గోపాల్‌రెడ్డి, ఏఎస్‌ఐ శేషగిరి ఆర్‌ఐ కిరణ్మయి, వీఆర్‌ఓ ఓబుళేసు గ్రామానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ సుమారు 30 ట్రాక్టర్లు ఇసుక డంప్‌ను గుర్తించారు. వెంటనే ఇసుక డంప్‌ను తహశీల్దార్ గోపాల్‌రెడ్డి సీజ్ చేసినట్లు తెలిపారు.