క్రైమ్/లీగల్

చైన్ స్నాచర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ఇద్దరు నిందితులతో పాటు బ్యాగ్‌లు, సెల్‌ఫోన్‌లు దొంగలించిన నాలుగురు సభ్యులు కలిగిన ముఠాను నగర పోలీసులు పట్టుకుని వారి నుంచి ద్విచక్రవాహ నం, బంగారు అభరణాలు స్వాధీ నం చేసుకున్నారు. బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం మధ్యా హ్నం జరిగిన విలేఖరుల సమావేశం లో నగర పోలీస్ కమిషనర్ వివిధ కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈస్ట్, వెస్ట్, నార్త్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులతో పాటు సైదాబాద్ పోలీసులు కలిసి గత ఐదు రోజుల్లో కలిసి కట్టుగా పనిచేసి పేరు మోసిన ఇద్దరు చైన్‌స్నాచర్లను పట్టుకుని రిమాండ్‌కు తరిలించారు. జహీరాబాద్ ప్రాంతానికి చెందిన, ప్రస్తుతం ఓల్డ్ మలక్‌పేట్ రేస్ కోర్సు వహేద్‌నగర్‌లోని బీలాల్ మాసిదు ప్రాంతంలో నివాసం ఉంటున్న సయ్యద్ అస్లామ్ (28), వికారాబాద్ తాండురు ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ మహ్మద్ అమేర్ (22)ను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెం డు తులాల బంగారు, రెండు చైన్‌లు, బజాజ్ పాల్సర్‌తో పాటు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఏడో తరగతి వరకు చదువుకున్న అస్లాం వెల్డింగ్ పనిచేస్తున్నాడు. ఎదో రకంగా డబ్బు లు సంపాదించాలనే ఉద్ధేశ్యంతో చైన్‌స్నాచింగ్‌లను ఎంచుకున్నాడు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకోండ పో లీసు కమిషనరేట్ ప్రాంత