క్రైమ్/లీగల్

గుర్రంకొండ మార్కెట్ యార్డ్‌లో ఘర్షణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రంకొండ, నవంబర్ 6: గుర్రంకొండ టమోటా మార్కెట్‌యార్డ్‌లో మంగళవారం రైతుకు, మండీ వ్యాపారులకు మధ్య జరిగిన వాగ్వివాదాలు చిలికి చిలికి గాలివానలా తయారై చివరకు కత్తులతో పొడుచుకున్నారు. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. టమోటా రైతుల కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి. గుర్రంకొండ టమోటా మండీ యజమానికి, పెద్దమండ్యం మండలం కలిచెర్ల పంచాయతీకి చెందిన జనార్థన్‌రెడ్డి (32) గత సంవత్సరం నుండి టమోటాలు వేసేవాడు. మంగళవారం జనార్థన్‌రెడ్డి మండీ యజమాని నుండి తనకు రావాల్సిన టమోటా పట్టీలు ఇంతవరకు ఇవ్వలేదని, ఇప్పుడు ఇవ్వాలని పట్టుపట్టాడు. దీంతో మండీ యజమానులు ఖాదర్‌బాషా (40), అస్లాంబాషా (30) ఆగ్రహంతో రైతు జనార్థన్‌రెడ్డిని చెప్పులతో కొట్టారు. జనార్థన్‌రెడ్డి బస్టాండుకు వెళ్లి కత్తి తీసుకొచ్చి అస్లాంబాషాపై, ఖాదర్‌బాషాలపై దాడిచేసి ఒకరికి చేతిపై, మరొకరికి వీపుపైన పొడిచి పారిపోయాడు. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించగా, వారు ఖాదర్‌బాషా, అస్లాంబాషాలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అస్లాం బాషా మృతి చెందగా, ఖాదర్ బాషా పరిస్థితి విషమంగా ఉందని ఎస్‌ఐ నరేష్ తెలిపారు. తన సిబ్బందితో మార్కెట్ యార్డ్‌కు చేరుకున్న ఎస్‌ఐ వివరాలు తెలుసుకుని నిందితునిపై కేసు నమోదు చేశారు.