క్రైమ్/లీగల్

74 క్వింటాళ్ల రేషన్‌బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిద్దలూరు, నవంబర్ 6 : మండలంలోని కెఎస్‌పల్లి పంచాయతీలోని అక్కపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుఝామున 1 గంట సమయంలో ఒక ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచి లారీకి ఎత్తుతున్న రేషన్ బియ్యాన్ని స్వ్కాడ్ అధికారులు పట్టుకున్నారు. గిద్దలూరుకు తరలించి గోడౌన్‌లో అప్పగించారు. కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించనున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కెఎస్‌పల్లి గ్రామానికి చెందిన అన్నా శివయ్య అనే వ్యక్తి గత కొనే్నళ్లుగా ఈ రేషన్ బియ్యాన్ని డీలర్ల నుంచి కొనుగోలు చేసి కెఎస్‌పల్లి చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని ఇళ్లలో అక్రమంగా నిల్వ ఉంచి అదునుచూసి గుట్టుచప్పుడు కాకుండా మిల్లులకు తరలించేవారు. ఎక్కువశాతం గుంటూరు, పొద్దుటూరు, డోన్ తదితర ప్రాంతాలకు ఈ బియ్యం తరలిస్తారు. గత ఏడాది కూడా ఇదే వ్యాపారి శివయ్య ఇలాగే లారీలో రేషన్‌బియ్యం పంపుతుండగా కడప - గిద్దలూరు రహదారిలో చెక్‌పోస్టు దాటిన తరువాత పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ బనగానిపల్లిలో ఒకసారి పట్టుకున్నారు. అయితే శివయ్యకు చెక్‌పోస్టు దాటించే వరకే బాధ్యత. ఈ వ్యాపారం యధేచ్ఛగా ఏళ్ల తరబడి సాగుతోంది. డీలర్ల వద్ద మిగిలిన బియ్యం శివయ్య కొనుగోలు చేసి ఇలా అక్రమ రవాణా చేస్తుంటాడు. అదే క్రమంలో మంగళవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో లారీకి అక్కపల్లి గ్రామంలోని ఒక ఇంటిలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం ప్లాస్టిక్ సంచులకు మార్చి కూలీల ద్వారా లోడ్ చేస్తుండగా గిద్దలూరు ఎన్‌ఫోర్సుమెంట్ డీటీ శ్రీనివాసరావు, సింగరాయకొండ డీటీ సిహెచ్ కృష్ణమోహన్, అద్దంకి డీటీ వెంకట్, ఎఫ్‌ఐ కృష్ణమోహన్‌లతో కూడిన బృందం సమాచారం మేరకు దాడులు నిర్వహించి లారీ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వ్యాపారి శివయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకాలం నుంచి జరుగుతున్న అక్రమ రేషన్‌బియ్యం వ్యాపారాన్ని అధికారులు ఛేదించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శివయ్యపై కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించనున్నారు.