క్రైమ్/లీగల్

నకిలీ మద్యం విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూన్ 8: నకిలీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్న ఓ ముఠాను ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ ఖురేషీ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బొమ్మిడి వీరబాబు రంగారెడ్డి గత పది సంవత్సరాలుగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయి గ్రామంలో మేస్ర్తి పని చేసుకుంటూ ఇంట్లోనే బెల్ట్ షాపు నిర్వహిస్తున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో నకిలీ మద్యం తయారు చేసి తన బెల్ట్‌షాపులోనే విక్రయిస్తున్నాడు. నకిలీ మద్యం తయారీకి సాతంరాయి గ్రామ సమీపంలో ఉన్న బగ్గా డిస్టిలరీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న వినోద్, కృష్ణగౌడ్, ఇమ్రాన్, సిద్దికీ సహాయం తీసుకున్నాడు. ముడి సరుకులను వారు పని చేస్తున్న కంపెనీ నుంచి దొంగతనంగా తీసుకొని, వారి సలహా మేరకు నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావడంతో నకిలీ మద్యం వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అనే చందంగా నడుస్తుందని పోలీసులు తెలిపారు.
విశ్వసనీయంగా సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు.. దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని 60 లీటర్ల మద్యం, వివిధ బ్రాండ్ల కంపెనీల మూతలు, సీసాలు స్వాధీనం చేసుకొని వీరబాబుతో పాటు మరో నలుగురు వ్యక్తులను రిమాండ్‌కు తరలించినట్లు ఖురేషీ వెల్లడించారు.