క్రైమ్/లీగల్

‘షీ’ టీంకు చిక్కిన ఇద్దరు వేధింపురాయుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: నగరంలో మహిళలను వేధిస్తున్నట్లు అందిన రెండు ఫిర్యాదుల మేరకు షీ టీం ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. పెళ్లి చేసుకోవాలని ఒకరు, ఫోన్‌లో వేధిస్తున్న మరొకరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు నగర నేర విభాగం అదనపు సిపి షికా గోయల్ తెలిపారు. చార్మినార్ ప్రాంతంలోని జహనుమాలో ఉస్మాన్ అహ్మద్ ఆలాఖిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలోని ఒక పాఠశాలలో మహిళ ఒకరు ఉపాధ్యాయినిగా పని చేస్తోంది. అక్కడే ముగ్గురు పిల్లలకు ట్యూషన్ కూడా చెబుతోంది. ట్యూషన్‌కు పిల్లలను తీసుకు వచ్చే ఉస్మాన్ ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించే వాడు. అప్పటి నుంచి వేధించడం ప్రారంభించాడు. చివరకు తనను పెళ్లి చేసుకోవాలని గొడవ చేశాడు. దీంతో విసిగిపోయి ఉపాధ్యాయిని ఉద్యోగాన్ని, ట్యూషన్‌ను కూడా ఆమె వదిలివేసింది. అయినా వేధింపులు మానలేదు. ఇలా రెండేళ్లు గడచిపోయినా వేధింపులు తగ్గక పోవడంతో ఆమె షీ టీంను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో షీ టీం నిందితుడిని పట్టుకుని విచారించగా, తాను ఆమెను వేధించినట్లు అంగీకరించాడు. నిందితుడిని ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు. కాగా మరో కేసులో ఫోన్లో వేధిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తార్నాక బిగ్‌బజార్ బ్రాంచ్‌లో పని చేస్తున్న మహిళను తరచు ఆ మాల్‌కు వచ్చి ఫోన్ నెంబర్ ఇవ్వాలని ఒక వ్యక్తి వేధించడం ప్రారంభించాడు. చివరకు ఆమె షీ టీంను ఆశ్రయించడంతో ఫిర్యాదు నమోదు చేసుకుని మొబైల్ నెంబర్ల ఆధారంగా విచారించగా కొండాపూర్‌లోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన కుంపాటి కిరణ్ బాబుగా గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకుని ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులకు అప్పగించారు.