క్రైమ్/లీగల్

మాజీ ప్రిన్సిపాల్ పాడు బుద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: కొందరు సినీ తారలను కాల్‌గర్ల్స్‌గా చూపిస్తూ వారి ఫోటోలను, వాటి కింద రేట్లను ఉంచి ఓ వెబ్‌సైట్లో పెట్టిన నిందితుడిని నగర సిసిఎస్ సైబర్ క్రైం పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి సైబర్ క్రైం ఎసిపి రఘువీర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లోకాన్టో అనే వెబ్‌సైట్‌లో కొందరు సినిమా తారల ఫోటోలను, వారి పేర్లతో కాల్‌గర్ల్స్‌గా పేర్కొంటూ వారికి ఎంత ధర చెల్లించాలనే రేట్ కార్డులను ఉంచాడు. ఎస్కార్ట్ సర్వీస్ పేరిట యువకుల నుంచి భారీగా డబ్బు కూడా వసూలు చేశాడు. ఒక్కో తారకు రూ.40 నుంచి 60 వేలు చెల్లించాల్సి ఉంటుందని ధరలను కూడా ప్రకటించాడు. నిందితుడు గణేశ్ పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి కొన్ని ఇంటర్ కళాశాలల్లో లెక్చరర్‌గా పని చేసి ఆ తర్వాత దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పని చేశాడు. కొన్ని నెలల కిందట ఉద్యోగాన్ని వదిలేసి ఇలా డబ్బుకోసం అడ్డదారులు తొక్కాడు. మీకు ఇష్టమైన నటీమణులతో గడపాలనుకుంటున్నారా..?, మీరు కోరుకున్నచోటకే వస్తారంటూ వారికి ఒక్కో రేటు పెట్టి వెబ్‌సైట్‌లో ప్రకటనలను గుప్పించాడు.
సైబర్ క్రైం పోలీసుల నిఘాలో ఈ సైట్ వివరాలు వెల్లడి కావడంతో రంగంలో దిగారు. వాటిలో గుర్తించిన ఒక తెలుగు నటి ఫోటో కనిపించడంతో ఆమెకు ఆ సమాచారం వెల్లడించారు. దీంతో షాకైన ఆ నటి తన సోదరుడికి తెలియజేయడంతో ఆ సైట్‌లో తన ఫోటో ఉంచినట్లు అతను కూడా చెప్పడంతో ఆమె కూడా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నిందితుడు గణేశ్ వివరాలు వెల్లడి కావడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఎస్కార్ట్ సర్వీస్ పేరుతో పలువురిని మోసం చేశానని పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎసిపి రఘువీర్ తెలిపారు. నిందితుడు ఇలా రూ.2 లక్షల వరకు విటుల నుంచి వసూలు చేసినట్లు అంగీకరించాడు. సినీ నటీమణులే కాకుండా కొందరు కాలేజీ అమ్మాయిల ఫోటోలను సైతం వెబ్‌సైట్లో ఉంచాడు. సుమారు 10 నుంచి 15 మంది ఫోటోలను వెబ్‌సైట్లో ఉంచాడని ఎసిపి తెలిపారు.