క్రైమ్/లీగల్

టాస్క్ఫోర్స్‌కి చిక్కిన ముగ్గురు నిందితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: నగరంలో 33 దొంగతనాలు చేసిన ముగ్గురు దొంగలు టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కారు. వీరి నుంచి రూ.70 లక్షల విలువైన 1.65 కిలోల బంగారం, 80 తులాల వెండి, హోండా అక్కార్డ్ కారు, పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు నగర సిపి అంజనీకుమార్ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి మాట్లాడుతూ సయ్యద్ మహ్మద్ (20), సయ్యద్ సాహిల్ (18), వీరి తల్లి సనా బేగం (39)లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇద్దరు కుమారులు ఎలాంటి పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ 2015 మార్చి నుంచి వరుస దొంగతనాలు చేస్తున్నారు. తన తల్లి సనా బేగం సూచనలతో హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేస్తున్నారు. గతంలో ఈ కుటుంబం టోలీచౌక్ పారావౌంట్ కాలనీలో నివశిస్తుండగా గోల్కొండ, లంగర్‌హౌజ్, హుమయూన్‌నగర్, ఆసిఫ్‌నగర్, బంజారాహిల్స్, సైబరాబాద్ పరిధిలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 33 దొంగతనాలు చేశారు. ఇందుకు సంబంధించి ఆయా స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇటీవల నెల రోజుల కిందట చాంద్రాయణగుట్ట షాహిన్ నగర్‌కు మకాం మార్చారు. ముందు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నదీ రెక్కీ నిర్వహించి అనంతరం నిర్ధారించుకున్న తర్వాత వంటగది, పడక గది కిటికీ ఊచలను విరగ్గొట్టి ఇంట్లో ప్రవేశిస్తారు. అందినంత దోచుకుంటారు. దోచుకు వచ్చిన సొత్తును తల్లి బేగంకు ఇస్తే ఆమె నూరుద్దీన్, తదితరులకు విక్రయిస్తుంది. ఇలా దోచిన డబ్బుతో విలాస జీవితం గడుపుతున్నారు. 2016లో నిందితుల్లో ఒకడైన మహ్మద్ జన్మదిన వేడుకను గోల్కొండ 7 టూంబ్స్ వద్ద ఉన్న ఎఫ్‌ఎఫ్ గార్డెన్‌లో రూ.5 లక్షలు ఖర్చు చేసి నిర్వహించారు. నిందితుల నుంచి శాంసంగ్ ఎల్‌ఈడి టివి, యుఎస్ డాలర్లు, 3 ట్యాబ్‌లు, 14 సెల్‌ఫోన్లు, 9 కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. ఉపాధి లేకపోయినా విలాస వంతంగా ఆమె, ఆమె కుమారులు తిరుగుతున్నారు. బంజారాహిల్స్‌లో జరిగిన ఒక కేసులో నిందితుల గురించి వివరాలు అందడంతో విచారణ చేశారు. అనంతరం అదుపులోకి తీసుకుని వారిని విచారించడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు నిందితులను తదుపరి చర్యలు తీసుకునేందుకు గోల్కొం డ పోలీసులకు అప్పగించినట్లు సిపి తెలిపారు. నగర వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బి.గట్టు మల్లు, ఎస్‌ఐలు వి.కిషోర్, ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లిఖార్జున్, ఎల్.్భస్కర్‌రెడ్డిలు, సిబ్బంది ఈ కేసును ఛేదించారు.

చిత్రం..స్వాధీనం చేసుకున్న ఆభరణాలు