క్రైమ్/లీగల్

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళ్లపూడి, జూన్ 19: చిన్నారి బాలికపై 25 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసిన సంఘటన మంగళవారం పెద్దేవంలో చోటుచేసుకుంది. తాళ్లపూడి ఎస్సై అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేవం గ్రామానికి చెందిన మూడవ తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికను మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో బుట్టాయగూడెం గ్రామానికి చెందిన మర్రి ఉదయ్‌కిరణ్ తన అమ్మమ్మ ఇంటికి వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి బజారుకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న బాలికను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇంటికి వచ్చిన తల్లికి బాలిక ఏడుస్తూ విషయం చెప్పింది. దీనితో బాలిక తల్లి తాళ్లపూడి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. కొవ్వూరు డీఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు.