క్రైమ్/లీగల్

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, జూన్ 19: రాజీవ్ రహదారి పై ఆర్టీసీ బస్సు ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన హృ దయ వీదారకమైన సంఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కీసర మండ లం చీర్యాల గ్రామానికి చెందిన మలగల చిన్న పెంట య్య(45), యాదాద్రి జిల్లా , బొమ్మలరామారం మం డలం, తుర్కల తూంకుంటకు చెందిన యాదగిరి (43), వరసకు వియ్యంకులు. శామీర్‌పేట మండలం యాడారం గ్రామంలోని బంధువుల విందులో పాల్గొనడానికి వచ్చారు. పని నిమిత్తం తుర్కపల్లి గ్రామానికి వెళ్లి తిరిగి యాడారం వస్తుండగా మురహారిపల్లి చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై నగరం నుంచి వేములవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు టీవిఎస్ ద్వీచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దింతో తీవ్రగాయాలైన ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలా పించారు. ఈ రోడ్డు ప్రమాదంలో రాజీవ్హ్రాదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మృతదేహాలను పొస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఈమేరకు శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బంధువుల ధర్నా...
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే కుటుంబ పోషకులను కోల్పోయామని మృతుల కుటుంబ సభ్యులు రోడ్డు పై బైటాయంచి ధర్నా నిర్వహించారు. కుటుంబ పెద్ద దిక్కును పోగొట్టుకున్నామని, తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేవరకు మృదేహాలను తరలించేది లేదని బంధువులు, స్థానికులు భీష్మించు కు కూర్చున్నారు. ఉద్రిక్తత వాతవర్ణం నెలకొనడంతో శామీర్‌పేట పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన కారులను శాంతిప చేశారు.
సాయి నాచారం గ్రామంలో..
బొంరాస్‌పేట: మండల పరిధిలోని అల్లిఖాన్‌పల్లి గ్రామానికి చెందిన కావలి సాయి (32) రోడ్డు ప్రమాదంలో మంగళవారం మృతిచెందిన సంఘటన నాచారం గ్రామంలో చోటు చేసుకుంది. సాయి నాచారం గ్రామానికి నడిచి వెళ్తుండగా వేగంగా వస్తున్న కారు (నంబరు టీఎస్ 09 ఈయూ 0330) ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కారు కుదురుమళ్ల గ్రామానికి చెందిన మల్లేశానికి చెందినదని గుర్తించారు. సాయి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తికి తీవ్ర గాయాలు...
కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ వద్ద చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం షాద్‌నగర్ వైపు వెళ్తున్న ట్రక్క్‌ను వెనుక వైపు నుంచి టాటా ఏసీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. టాటా ఏసీలో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని సుమారు 40 సంవత్సరాల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం హైద్రాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.