క్రైమ్/లీగల్

నీట మునిగి రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, జూన్ 19: మట్టికోసం మొండివాగులో తవ్విన గుంతలో నీరు నిండగా, అందులో పడి బావన నరేందర్ (42)అనే రైతు మృతి చెందాడు. ఇటీవల కురిసిన వర్షాలకు మొండివాగులోని గుంతలన్నీ నీటితో నిండిపోయాయి. అందులో మోటార్లను ఏర్పాటు చేసుకుని రైతులు పంటలు పండించుకుంటున్నారు. మంగళవారం బావిలో ఉన్న మోటార్‌ను సరి చేసేందుకు దిగగా, ప్రమాదవశాత్తు అందులోనే మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, కుటుంబ సభ్యులు మొండివాగు వద్దకు చేరుకుని నరేందర్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నీటిగుంత లోతు ఎక్కువగా ఉండి, బురదగా ఉండటంతో మరణించి ఉంటాడని స్థానికులు అభిప్రాయపడ్డారు. రైతు సమస్యలపై, పలు అంశాలపై పోరాడటంలో ఎల్లవేళలా ముందుండే రవీందర్ మృతి చెందడంతో రైతులు కంటనీరు పెట్టారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెతికితీసి పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.