క్రైమ్/లీగల్

స్టీల్ పరిశ్రమలో ఫర్నెస్ పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమీన్‌పూర్, జూన్ 23: ప్రమాదాలకు నిలయంగా మారిన అగర్వాల్ స్టీల్ పరిశ్రమ యాజమాన్యం అమాయక కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూనే ఉంది. కార్మిక శాఖ, కాలుష్య నియంత్రణ శాఖలు మాత్రం యాజమాన్యం అలసత్వానికి వత్తాసు పలుకుతున్నాయన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆయా ప్రమాదాల్లో కార్మికులు మరణిస్తున్నా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. తాజాగా శనివారం తెల్లవారు జామున మరో సంఘటన చోటు చేసుకోవడంతో పలువురు కార్మికులు గాయాలపాలయ్యారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్షం ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడిన సంఘటన అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి తోటి కార్మికులు, స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అమీన్‌పూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతిలోని అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో శనివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఫర్నెస్ వద్ద సాంకేతిక సమస్య తలెత్తడంతో స్టీల్ మిశ్రమం నిలువ ఉంచె తొట్టిలోనుండి ఇనుప ద్రవం దొర్లింది. కాగా రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో ఫర్నెస్ ముంద భారీగా నీరు నిలువ ఉంది. దీంతోతోట్టిలోని ఇనుపద్రవం ఒక్కసారిగా నిలువ ఉన్న నీటిలో పడడంతో పెద్ద ఎత్తున గ్యాస్ వెలువడింది. గ్యాస్ తీవ్రతకు పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించి పరిశ్రమ పైకప్పులు చెల్లాచెదురయ్యాయి. ఫర్నెస్‌లో కాగుతున్న ఇనుము 1600 డిగ్రీల ఊష్ణోగ్రత వద్ద వేడి చేస్తుండడంతో శబ్ధం మరింత పెద్దగ వచ్చినట్లు పలువురు కార్మికులు తెలిపారు. పేలుడు పెద్దగా సంభవించటంతో అక్కడే క్రేన్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న భిహార్‌కు చెందిన మనోజ్ మెహతా(30) తీవ్రంగా గాయపడగా ఒరిస్సాకు చెందిన చందన్ (25), పంచ్ (40)లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరితో పాటు మరో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులను నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సచేయిస్తున్నట్టు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు తెలిపారు. కాగా పరిశ్రమలో కార్మికులకు పని గురించి సరి అయిన అవగాహన లేని మూలంగానే ప్రమాదం సంభవించిందని పలువురు పేర్కొంటున్నారు. గతంలో ఈ పరిశ్రమలో ఎన్నో ప్రమాదాలు జరిగినట్టు స్థానికులు తెలిపారు. ఇదే పరిశ్రమలో 2011 సంవత్సరంలో బిహార్‌కు చెందిన సంతోష్ అనే కార్మికుడు మృత్యువాత పడ్డాడు. కార్మికుని కుటుంబానికి పరిశ్రమ యాజమాణ్యం నష్టపరిహారం చెల్లించడంలో తాత్సార్యం చేయడంతో కార్మిక సంఘాలు కల్పించుకొని మృతుని కుటుంబానికి న్యాయం చేశాయి. అదేవిదంగా 2010లో మనోజ్ అనే కార్మికుడు క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తు విద్యుత్ షాక్ తగిలి మృత్యువాత పడ్డాడు. పరిశ్రమ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకొని కేసు నమోదు చేయించారు. పరిశ్రమల తనఖీ అధికారి నిర్లక్ష్యం మూలంగానే తరుచూ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో ప్రమాదాలు సంభవిస్తున్నట్లు కార్మికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైన సంబంధిత శాఖ అధికారులు పరిశ్రమపై తగిన చర్యలు చేపట్టి గాయపడిన కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ దత్తు సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.