క్రైమ్/లీగల్

చెట్లు నరికి భవనాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: చెట్లను నరికివేసి, ఆ స్థలాల్లో భవనాలను నిర్మించాలనుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఢిల్లీ హై కోర్టు స్పష్టం చేసింది. వచ్చేనెల నాలుగో తేదీ వరకూ చెట్లను నరికే ప్రయత్నం చేయవద్దని నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ)ని ఆదేశించింది. చెట్లు నరికి భవనాల నిర్మాణమా? అంటూ ఎన్‌బీసీసీని నిలదీసింది. దక్షిణ ఢిల్లీలోని సుమారు డజను కాలనీల్లో పాత ఇళ్లను తొలగించి, కొత్తగా గృహ సముదాయాలను నిర్మించాలని ఎన్‌బీసీసీ నిర్ణయించింది. పర్యావరణ అనుమతి (ఈసీ)ని కూడా సంపాదించింది. అయితే, కాలుష్యం కోరల్లో అల్లాడుతున్న ఢిల్లీలో భవనాల నిర్మాణం కోసం విచక్షణా రహితంగా చెట్లను కొట్టివేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని, ఈ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా ఎన్‌బీసీసీని ఆదేశించాలని కోరుతూ డాక్టర్ కౌశల్ కాంత్ మిశ్రా అనే ఆయుర్వేద వైద్యుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు, ఈసీ అనుమతి ఉందని, ప్రత్యేకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదని ఎన్‌బీసీసీ వాదించింది. ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుకునే హక్కు ఎన్‌జీటీకి లేదని స్పష్టం చేసింది. ముదుగా అన్ని అనుమతులు తీసుకొని, ఆతర్వాతే భవన నిర్మాణాలకు సిద్ధమయ్యామని వివరించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది జేపీ సేంగ్ కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయానే్న వ్యక్తం చేశారు. కేంద్ర పరిధిలోని ఈసీ అనుమతి లభించిన తర్వాత, ఇతరత్రా అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తులు వినోద్ గోయల్, రేఖా పల్లి సభ్యులుగా ఉన్న ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం వచ్చేనెల రెండో తేదీ వరకూ చెట్లను నరికివేసే ప్రక్రియను నిలిపివేయాలని ఎన్‌బీసీసీని ఆవేశించింది. చెట్లను కొట్టివేయడానికి ఈసీ ఇచ్చిన అనుమతిని ఎన్‌జీటీలో సవాలు చేయాల్సిందిగా పిటిషనర్ దారుడు కౌశల్ కాంత్‌కు సూచించింది. జూలై నాలుగో తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది. కాగా, ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను అనుసరించి వచ్చేనెల నాలుగో తేదీ వరకూ దక్షిణ ఢిల్లీలో భవన నిర్మాణాలకు నిర్దేశించిన ప్రాంతంలో ఒక్క చెట్టును కూడా నరకబోమని ఎన్‌బీసీసీ ప్రకటించింది.