క్రైమ్/లీగల్

కట్నం వేధింపులు.. కానిస్టేబుల్‌పై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూన్ 29: వివాహమైన పదిహేనేళ్ల తరువాత అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు ఓ కానిస్టేబుల్ గురిచేస్తున్నాడు. తను ప్రభుత్వ ఉద్యోగినని, తక్కువ కట్నం ఇచ్చి తనకు పెళ్లి చేశారని భార్యను నిత్యం వేధిస్తూ నరకం చూపుతున్నాడు. ముగ్గురు ఆడపిల్లలను కన్నందుకు మరో పెళ్లి చేసుకుంటానని బెదిరించేవాడు. గురువారం మధ్యాహ్నం భార్యపై దాడి చేయడంతో ఇరుగుపొరుగు.. షీటీమ్‌కు ఫోన్ చేశారు. షీటీమ్ సభ్యులు కానిస్టేబుల్‌కి కౌనె్సలింగ్ చేయగా సక్రమంగా నడుచుకుంటానని చెప్పి నమ్మించిన కొద్దిసేపటికే తీవ్రంగా కొట్టి కత్తితో దాడి చేశాడు. దీంతో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా మాదాపూర్ పోలీసులు కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగద్గిరిగుట్ట పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వలీబాషాకు కర్నూల్ టూటౌన్‌కు చెందిన షేక్ హసీనాబానుతో 2002లో వివాహమైంది. పెళ్లి సమయంలో రెండులక్షల కట్నం, 15తులాల బంగారంతో పాటు మోటార్ సైకిల్, ఇతర వస్తువులు ఇచ్చారు. వివాహం అయినప్పటి నుంచి మాదాపూర్ పోలీసు క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, కుమారుడు ఉన్నారు. మొదట్లో చాలా అన్యోన్యంగా ఉండేవారు. నాలుగు సంవత్సరాల నుండి హసీనాబాను వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వలీబాషాకు రెండు పర్యాయాలు కుటుంబ పెద్దలు, ఐదుసార్లు కర్నూలు పోలీసులు కౌన్సిలింగ్ చేసినా అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. గురువారం మధ్యాహ్నం భార్యను తీవ్రంగా కొడుతుండడంతో పోలీసు క్వార్టర్స్‌లోని తోటి మహిళ అడ్డుకొన్నప్పటికీ వినకపోవడంతో షీటీమ్‌కు ఫోన్ చేశారు. షీటీమ్ సభ్యులు వచ్చి వలీబాషాకు కౌనె్సలింగ్ చేశారు. ఆ సమయంలో ఇప్పటి నుంచి ఎలాంటి గొడవపడనని చెప్పి మహిళా పోలీసులు వెళ్లిన కొద్దిసేపటికే తిరిగి భార్యతో గొడవ పడడంతోపాటు కత్తితో దాడి చేయడంతో మాదాపూర్ పోలీసులకు హసీనా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.