క్రైమ్/లీగల్

ఆర్మీ మేజర్‌కు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: తన సహచర అధికారి భార్యను హత్యచేశాడన్న ఆరోపణలపై అరెస్టయిన ఆర్మీ మేజర్‌కు ఢిల్లీ హైకోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆర్మీ మేజర్ నిఖిల్ హాండాకు విధించిన నాలుగు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతోపోలీసులు ఆయన్ను శుక్రవారం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేడ్ కోర్టులో హాజరు పరచారు. కకాగా నిందితుడికి 14 రోజుల జ్యుడియల్ రిమాండ్ విధించి, జూలై 13న తిరిగి కోర్టులో హాజరు పరచాలని మెజిస్ట్రేట్ మనీషా త్రిపాఠీ ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ ఢిల్లీలో మరో మేజర్ భార్యను హత్య చేశాడన్న నేరారోపణపై మేజర్ నిఖిల్ హాండాను పోలీసులు ఉత్తర ప్రదేశ్‌లోని మీరుట్‌లో జూన్ 24న అరెస్ట్ చేశారు. కాగా నాలుగు రోజుల కస్టడీ సమయంలో అనేక వివరాలు తెలిసాయని, పోలీసు కస్టడీ అవసరం లేదని రికవరీ అధికారి కోర్టుకు తెలిపారు. కాగా నిందితుడి తరపు లాయర్ సంజీవ్ షాహీ, తన క్లైంట్‌తో 10 నిముషాలు మాట్లాడటానికి అవకాశమివ్వాలని కోర్టును అభ్యర్థించగా అందుకు అనుమతించింది.