క్రైమ్/లీగల్

బైరెడ్డిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైరెడ్డిపల్లి, జూన్ 29: పలమనేరు-కుప్పం జాతీయ రహదారి మార్గంలో చిత్తూరు జిల్లా ఇల్లూరు గ్రామం వద్ద ఇన్నోవా వాహనం ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన శుక్రవారం జరిగింది. మృతి చెందిన యువకులందరూ వారి కుటుంబాల్లో రెండో సంతానం కాగా, అందరూ కూడా స్నేహితులే. వారి రెండు దశాబ్దాల జీవనంలో స్నేహబంధాన్ని ఎలా కొనసాగించారో, చివరకు మృత్యువుతో కూడా కలిసి వెళ్లడం బైరెడ్డిపల్లి వాసులను కలచివేసింది. బైరెడ్డిపల్లికి చెందిన ప్రైవేట్ సంస్థలో చిరు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి కుటుంబాలకు చెందిన తేజ (23), కిశోర్ (22), వినోద్ (21), వంశీధర్ (21). వీరు శుక్రవారం పలమనేరుకు ఒకే ద్విచక్ర వాహనంలో కలిసివెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఇల్లూరు గ్రామం సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనం వచ్చి ఢీకొంది. ఢీకొన్న వేగానికి ఇద్దరు యువకులు రోడ్డుపై పడి మృతిచెందగా, వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం మంటలకు గురై మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న గంగవరం సీఐ రవికుమార్, ఎఎస్‌ఐ ఎండి రాజులు తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకులు మృతి చెందారు. కాగా, ఈప్రమాదానికి కారణమైన ఇన్నోవాలో ప్రయాణిస్తున్న పలమనేరు వాసులు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలమనేరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.