క్రైమ్/లీగల్

మాల్యాకు ముంబయి కోర్టు సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 30: బ్యాంకులను మోసం చేసిన కేసులో దేశం నుంచి పరారై లండన్‌లో తలదాచుకుంటున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. బ్యాంకులకు రూ.9వేల కోట్ల మేర బకాయిలు పడి చెల్లించకుండా పరారైన మాల్యా కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే. మాల్యాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడి దాఖలు చేసిన పిటిషన్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ ఆజ్మీ ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో ఈడి రెండవ చార్జిషీటును దాఖలు చేసింది.
ఈ నెల22వ తేదీన అనుబంధంగా మరో దరఖాస్తును కూడా దాఖలు చేసింది. రుణాలను ఎగగొట్టి పరారైన వారికి ఈ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఏర్పాటైన కోర్టు ద్వారా సమన్లు ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ చట్టాలకు సంబంధించి నిబంధనలను కేంద్రం తాజాగా జారీ చేసింది. మాల్యాతో పాటు ఇతర ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల జప్తుకు అనుమతి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. మాల్యాకు చెందిన రూ.12,500 కోట్ల ఆస్తులను జప్తుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కోర్టు సమన్లకు స్పందించకుండా ఉంటే, మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడుగా ప్రకటిస్తారు. దీనికి తోడు మొత్తం ఆస్తులను జప్తు చేస్తారు. ఈడీ దాఖలు చేసిన కేసులకు సంబంధించి రెండు సార్లు ఈ కోర్టు సమన్లు జారీ చేసింది. మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ప్రస్తుతం పనిచేయడం లేదు.
మాల్యా యుపిఏ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.9990 కోట్ల రుణాలను తీసుకుని ఎగ్గొట్టారు. తనపై వచ్చిన అభియోగాలకు సంబంధించి తన వాదన వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని మాల్యా 2016 ఏప్రిల్ 15వ తేదీన ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రికి లేఖ రాశారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న మాల్యా తనపై రాజకీయ పార్టీలు బురదజల్లుతున్నాయని ఆరోపించారు. తనను కొన్ని బ్యాంకులు ఎగవేతదారుడిగా చిత్రీకరిస్తున్నాయన్నారు. ప్రస్తుతం లండన్ కోర్టులో కూడా మాల్యా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలను, భారత్ నుంచి పరారై లండన్‌కు వచ్చి స్థిరపడిన కేసులను ఎదుర్కొంటున్నారు.