క్రైమ్/లీగల్

హమాలీ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాప్తాడు, జూలై 1 : మండల కేంద్రానికి చెందిన చెన్నకేశవ (30) ఆదివారం ఉరేసుకుని మృతిచెందాడు. ఎస్సై ధరణిబాబు తెలిపిన వివరాల మేరకు కుంటిమద్దికి చెందిన చెన్నకేశవ నాలుగు సంవత్సరాల క్రితం రాప్తాడుకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకుని హమాలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రెండు సంవత్సరాల నుంచి మద్యానికి బానిసై కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో కడుపునొప్పి తాళలేక ఆదివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించామన్నారు.