క్రైమ్/లీగల్

అన్నతో కలిసి ప్రియుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేటపాలెం, జూలై1: మండల పరిధిలోని దేశాయిపేట పంచాయతీ విజయనగర్ కాలనీలో శుక్రవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను డిఎస్పీ వి శ్రీనివాసరావు వేటపాలెం పోలీసు కార్యాలయంలో ఆదివారం విలేఖర్లకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు పై కాలనీలో నివశిస్తున్న షేక్ కరిమూన్ ఇంట్లో 13 ఏళ్ల క్రితం హతుడు పింజల బాలచంద్రశేఖరరావు అద్దెకున్నాడు. అప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. గడిచిన నాలుగున్నర ఏళ్లుగా హతుడు చిలకలూరిపేట, గుంటూరు ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ అప్పుడప్పుడు ఆమె వద్దకు వచ్చి వెళ్లేవాడు. అయితే ఇటీవల మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తుందని కరీమూన్‌తో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో గత నెల 26న తన తండ్రి సంవత్సరీకానికి వచ్చిన బాలచంద్రశేఖరరావుకు ఆమెతో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పక్కనే శాంతినగర్‌లో ఉంటున్న మృతుడి అన్న సుబ్బారాయుడు ఇంటికొచ్చిన కరీమూన్ ఘర్షణ పడి చంద్రశేఖరరావుని చంపుతానని బెదిరించింది. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి కరీమూన్ ఇంటికెళ్లిన చంద్రశేఖరరావును తన సోదరుడు ఖాసిం పీర్‌తో కలిసి గునపంతో తలపై కొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండు వైపు వెళ్తున్న హతుడిని ఖాసిం వెంబడించి మొద్దు కత్తితో తల వెనుక భాగంలో కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఇంట్లోని రక్తపు మరకలు తుడిచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు కడిగి ఇంటి పక్కనే పూడ్చిపెట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఐపిసి 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. రూరల్ సి ఐ భక్తవత్సలరెడ్డి, వేటపాలెం, ఈపూరుపాలెం ఎస్సైలు వెంకట కృష్ణయ్య, అనూక్‌తో పాటు సిబ్బందిని ఆయన అభినందించారు.