క్రైమ్/లీగల్

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 1: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని టాస్క్ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. సాగర్ నరేష్, సాగర్ కార్తీక్ ఇరువురు మోటార్ సైకిల్‌పై 21.5 కేజీల గంజాయిని తీసుకెళుతుండగా మంగల్‌హట్ సీతారాంపేట ప్రకాశ్ థియేటర్ వద్ద పట్టుకున్నారు. సాగర్ నరేష్ తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన వాడు కాగా, సాగర్ కార్తీక్ విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకు చెందిన వాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు వీరు యాదాద్రిలో ఉంటూనే తమ స్వస్ధలాల నుంచి గంజాయి తీసుకు వచ్చి స్ధానికంగానూ, హైదరాబాద్ ప్రాంతాల్లోనూ అవసరమైన వారికి విక్రయిస్తున్నారు. తమ స్వస్ధలంలో గంజాయి కిలో రూ.2 వేలకు కొని హైదరాబాద్ తీసుకు వచ్చి రూ.5 వేలకు విక్రయిస్తున్నాడు. ఇలా విక్రయించిన గంజాయితో వచ్చిన డబ్బుతో తిరిగి తమ సొంత ఊళ్లకు వెళ్లి మళ్లీ కొన్ని రోజుల తర్వాత గంజాయి తీసుకు వచ్చి విక్రయించడం పనిగా పెట్టుకున్నారు. నిందితులు ఇద్దరినీ, స్వాధీనం చేసుకున్న గంజాయిని తదుపరి విచారణకు మంగల్‌హట్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.