క్రైమ్/లీగల్

వీకెండ్ విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్: వారంతా హైదరాబాద్ టీసీ ఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే యువ ఇంజనీర్లు.. సెలవుదినం కావడంతో కుంటాల జలపాతం సందర్శనకు వచ్చారు.. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు టైరు పేలడంతో ప్రమాదానికి గురయ్యారు... ఇద్దరు యువ ఇంజనీర్లతోపాటు కారు డ్రైవర్ మృతిచెందడం కలిచివేసింది... నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల కొండాపూర్ గ్రామ సమీపంలో గల 61వ నంబర్ జాతీయ రహదారి బైపాస్ రోడ్డువద్ద జరిగిన ప్రమాదం విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే... పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్ టీసీఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్లు కుష్మ, శ్రీవిద్య, నిఖిత, నవీన్, యుగేంధర్‌లు ఇన్నోవా కారును అద్దెకు తీసుకుని డ్రైవర్ దినేష్‌తో కలిసి ఉదయం కుంటాల జలపాతానికి వచ్చారు. జలపాతంను సందర్శించి సాయంత్రం నాలుగు గంటలకు అక్కడి నుండి బయలుదేరారు. అరగంటలోనే కొండాపూర్ బైపాస్ జాతీయ రహదారి వద్దకు చేరుకోగా వేగంగా వెళ్తున్న కారు టైరు పేలిపోవడంతో పక్కనే ఉన్న సిమెంటు దిబ్బలకు కారు ఢీకొట్టి బోల్తాపడి కొద్దిదూరం వరకు దూసుకుపోయింది. దీంతో కారు నడుపుతున్న డ్రైవర్ దినేష్ (27), ఇంజనీర్ కుష్మ (26)లు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ ఇంజనీర్లు శ్రీవిద్య, నిఖిత, నవీన్, యుగేంధర్‌లను హుటాహుటిన నిర్మల్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. శ్రీవిద్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను నిజామాబాద్‌కు తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందింది. ప్రమాదం జరిగిన వెంటనే సి ఐ జీవన్‌రెడ్డి, ఎస్సై రాజులు సంఘటన స్థలానికి చేరుకుని వైద్య చికిత్సల కోసం 108లో బాధితులను ఆసుపత్రికి చేర్చారు. రోడ్డు ప్రమాదంలో యువ ఇంజనీర్లు మృత్యువాత పడడం తీవ్రంగా కలిచివేసింది. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రాలు..రోడ్డు ప్రమాదానికి గురైన కారు, మృతి చెందిన ఇంజనీర్ కుష్మ