క్రైమ్/లీగల్

అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్ల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 3: అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్లు మృతిచెందిన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బౌరంపేట్ గ్రామంలో జరిగిన ఈ ఘటన గ్రామస్థులను కలచివేసింది. సీఐ శంకరయ్య, గ్రామస్థులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గండిమైసమ్మ దుందిగల్ మండల పరిధిలోని బౌరంపేట్ గ్రామంలో నివాసముండే అల్లంతగారి అనిత(28)కు శ్రీనుతో 2011 జూన్ 29న వివాహం జరిగింది. వీరికి కూతురు నవ్య (6) సంతానం. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుంది. శ్రీను డీసీఎం వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అనిత గండిమైసమ్మ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తోంది. సూరారం కాలనీ రాజీవ్ గృహకల్పలో నివాసముండే ప్రియాంక సైతం అనిత పని చేసే పరిశ్రమలోనే ఉద్యోగం చేస్తుంది. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. అనిత, ప్రియాంక ఇద్దరూ కలిసి ఫైనాన్షియల్ లావాదేవీలు కొంతకాలంగా సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అనిత నుంచి ప్రియాంక రూ.8 లక్షలు తీసుకుంది. ప్రియాంకను అనిత డబ్బులు ఇవ్వమని పదే పదే కోరినా ఇవ్వలేకపోయింది. సోమవారం సాయంత్రం నవ్య పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. మంగళవారం తెల్లవారుఝామున సుమారు 4గంటల ప్రాంతంలో శ్రీను డ్రైవింగ్ చేసేందుకు గండిమైసమ్మకు వెళ్లాడు. ఆ తరువాత సుమారు 6 గంటల ప్రాంతంలో అనిత తన కూతురు నవ్యను హత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు చూసి బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. దుందిగల్ సీఐ శంకరయ్య డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీమ్, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. తల్లీ, కూతురు మృతిచెందిన గదిలో వెతకగా సూసైడ్ నోట్ లభించింది. ప్రియాంక డబ్బులు ఇవ్వనందుకే మనస్థాపంతో ఉరి వేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో ఉందని పోలీసులు తెలిపారు. అనిత మృతదేహంపై గాయాలు ఉండడం అనుమానాలకు తావిస్తుంది. హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తును చేపట్టారు.