క్రైమ్/లీగల్

అర్వపల్లిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్వపల్లి, జూలై 3: గుప్త నిధుల కోసం తాంత్రిక పూజలు చేసి తవ్వకాలు జరిపిన సంఘటన మండల కేంద్రమైన అర్వపల్లిలో కలకలం రేకత్తించింది. సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీలక్ష్మినరసింహాస్వామి దేవాలయం కోనేరు పక్కన ఉన్న పాడుబడిన స్థలంలో అర్వపల్లికి చెందిన ముత్యాల బాలరాజు మరికొంత మందితో కలిసి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపాడు. స్థానికులకు అనుమానం వచ్చి వెళ్లి చూడగా తాంత్రిక పూజలకు అవసరమైన నల్లకోడి, నిమ్మకాయలు, గుమ్మడికాయ, పసుపు, కుంకుమలతో పూజలు జరుగుతున్నాయ. స్థానికులు వారిని నిలదీయడంతో అర్ధరాత్రి గ్రామంలో పూజలు ఎందుకు చేస్తున్నారని అడగడంతో వారు పరారయ్యారు. పూజలు జరిపిస్తున్న బాలరాజుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ మోహన్‌రెడ్డి తెలిపారు. కాగా ఆలయ పరిసరాల్లో తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని దేవాలయ చైర్మన్ బోడ్డు రామలింగయ్య, కమిటీ సభ్యులు లింగంపల్లి జగన్నాధం, బైరబోయిన వెంకటేశ్వర్లు, పులిచర్ల కృష్ణమూర్తి తెలిపారు.