క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుర్కపల్లి, జూలై 3: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని రుస్తాపురం గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన యాసారం కనకయ్య (38) స్వగ్రామం నుండి భువనగిరికి మోటారు బైకుపై వెళ్తుండగా రుస్తాపురం గ్రామశివారులో భువనగిరి నుండి మాదాపురం గ్రామానికి వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కనకయ్య తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడని తెలిపారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలున్నారని, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని సర్పంచ్ నర్సింహులు కోరారు.