క్రైమ్/లీగల్

భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 3: జిల్లా కేంద్రంలోని నాందేవ్‌వాడ ప్రాంతంలో జరిగిన భారీ చోరీ కేసును వారం రోజుల వ్యవధిలోనే నగర పోలీసులు ఛేదించగలిగారు. చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి చోరీ సొత్తును రికవరీ చేశారు. మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అదనపు డీసీపీ శ్రీ్ధర్‌రెడ్డి పట్టుబడ్డ నిందితుల వివరాలను వెల్లడించారు. గత నెల 28వ తేదీన త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాందేవ్‌వాడలో నివాసం ఉంటున్న కే.దయానంద్ అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలు చోరీ జరిగింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు 11 తులాల బంగారు ఆభరణాలు, 5.35లక్షల రూపాయల నగదును అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు, అన్ని వివరాలు తెలిసిన వ్యక్తులే ఈ చోరీకి పాల్పడి ఉంటారని భావించారు. దయానంద్ వద్ద కారు డ్రైవర్‌గా పని చేస్తున్న అర్సాపల్లి ప్రాంత నివాసి శేక్ ఇమ్రాన్‌పై అనుమానంతో అతని కదలికలపై నిఘా ఉంచారు. అతనిని మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరుపగా, భారీ చోరీకి పాల్పడింది తామేనని అంగీకరించాడని అదనపు డీసీపీ తెలిపారు. ఇమ్రాన్ తన స్నేహితులైన ఇస్లాంపురా కాలనీకి చెందిన మహ్మద్ ఫైజాన్, జవహార్‌రోడ్‌లోని సతీష్‌నగర్‌కు చెందిన శేక్ రియాజ్, అముల్ జాదవ్‌లతో కలిసి తాను పని చేస్తున్న యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడ్డారని వివరించారు. గత నెల 28వ తేదీన దయానంద్ తన ఇంటి తలపులను మూసి కేవలం గేటుకు మాత్రమే బయట నుండి తాళం వేసి వెళ్లాడు. ఈ విషయం తెలిసిన ఇమ్రాన్ ఇండికా కారులో తన ముగ్గురు స్నేహితులతో కలిసి వచ్చి గేటు దూకి లోనికి వెళ్లి అల్మారాలో దాచి ఉంచిన 5.35లక్షల నగదు, 11తులాల బంగారు ఆభరణాలను తీసుకుని ఉడాయించారని అన్నారు. చోరీ కోసం ఉపయోగించిన కారు మహ్మద్ ఫైజాన్‌కు చెందినదని తెలిపారు. ఇంట్లోని నగదు, నగలు దాచిన అల్మారా చెస్ట్‌ను ఎత్తుకొచ్చి కారులో అక్కడి నుండి కామారెడ్డి శివారు ప్రాంతానికి చేరుకున్నారని వివరించారు. అక్కడ క్యాష్ చెస్ట్‌ను బద్దలు కొట్టి, అందులో 5.35లక్షల నగదు లభ్యమవగా, నలుగురు పంచుకున్నారని, నగలను పరిస్థితులు అనుకూలించిన తరువాత విక్రయించాలని నిర్ణయించుకుని ఇమ్రాన్ తన వద్దే అట్టి పెట్టుకున్నాడని అన్నారు. చోరీ డబ్బులు పంచుకున్న తరువాత తమకేమీ తెలియనట్టుగా నిందితులు ఇళ్లకు చేరుకున్నారని, దోచుకున్న డబ్బులో కొంత మొత్తాన్ని జల్సాల కోసం వినియోగించారని వివరించారు. నిందితులను పట్టుకుని, వారి వద్ద నుండి 4.99లక్షల నగదు, 7.5తులాల బంగారు ఆభరణాలను, చోరీ కోసం ఉపయోగించిన ఇండికా కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ, ఎస్‌ఐలతో పాటు సీసీఎస్ పోలీసులను అదనపు డీసీపీ అభినందించారు. విలేఖరుల సమావేశంలో నిజామాబాద్ ఏసీపీ ఎం.సుదర్శన్ పాల్గొన్నారు.