క్రైమ్/లీగల్

జూద గృహాలపై పోలీసు దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 3: ఈ నెల 1వ తేదీన హన్వాడ మండలంలోని కొత్తచెరువుతాండలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో హన్వాడ ఎస్సై రాంబాబు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మహబూబ్‌నగర్ రూరల్ కానిస్టేబుల్‌తో పాటు 14మంది పేకాట రాయుళ్లను ఆరెస్టు చేసినట్లు డీటీసీ డీఎస్పీ సాయిమనోహర్ వెల్లడించారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌కు చెందిన బాలరాజు అనే వ్యక్తి గత కొనే్నళ్లుగా పేకాట స్థావరాలను నిర్వహిస్తున్నారని సమాచారంతో పోలీసులు దాడులు చేసి నిందితుల నుంచి రూ.1.24లక్షలు, 10 మోటార్‌సైకిళ్లు, 16సెల్‌ఫోన్లన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సాయిమనోహర్ తెలిపారు. నింధితులు పల్లె వంశీ, ఎండి పాష, సయ్యద్ మోజిద్, సతీష్, అసద్‌భీన్‌సలాన్, నానావత్ రాజు, తిరుపతయ్య, చెరుకు నరసింహులు, చంద్రనారాయణ, మంగి వెంకటస్వామి, ఎద్దుల రాఘవేందర్, నాగరాజు, వెంకటేష్, శంకర్‌నాయక్‌లను ఆరెస్టు చేయడం జరిగిందని అన్నారు. పేకాట స్థావరాలను నిర్వహిస్తున్న బాలరాజు, శివ అనే వ్యక్తులకు నోటీసులు ఇవ్వగా వారు కేసును తారుమారు చేయాలనే ఆలోచనకు రావడంతో వారిని కూడా ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో హన్వాడ ఎస్సై రాంబాబు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.