క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గనే్నరువరం, జూలై 3: మండలంలోని జంగపల్లి గ్రామంలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అనుమండ్ల కొమురయ్య (51) గత రెండు సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. పంట దిగుబడి రాకపోవడంతో, తెచ్చిన అప్పులు తీర్చలేక పోవడంతో, ఈ సంవత్సరం వేసిన పత్తి విత్తనాలు మొలువకపోవడంతో ఊరి బయట చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, సోమవారం వ్యవసాయం పని చేసుకొని ఇంటికి రాకపోవడంతో వెతుకగా చెట్టుకు ఉరి వేసుకొని ఉండటం గమనించిన మృతుని అన్న కొడుకు కటుంబ సభ్యులకు తెలియజేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వంశీకృష్ణ తెలిపారు.