క్రైమ్/లీగల్

పిఠాపురం రోడ్డులో ఆటోను ఢీకొట్టిన లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, జూలై 3: సామర్లకోట-పిఠాపురం రోడ్డులో జీడిపిక్కల ఫ్యాక్టరీ సమీపంలో మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆటోను లారీ ఢీకొట్టిన సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న అయిదుగురు గాయపడ్డారు. స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం..జల్లూరు వైపు నుంచి ఆటో వస్తుండగా, వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న చింతపల్లి శ్రీను (జల్లూరు), దూలపల్లి అప్పారావు (గోనేడ), రేవు రాజులమ్మ (కాపవరం), పోలిశెట్టి వెంకటేశ్వరరావు (పిఠాపురం), వైబోయిన అప్పారావు (పెద్దాపురం)లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సామర్లకోట ప్రభుత్వ క్లస్టరు ఆసుపత్రికి తరలించారు. చింతపల్లి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదుజేసి సామర్లకోట ఎస్సై ఎల్ శ్రీనువాసునాయక్ దర్యాప్తు చేస్తున్నారు.