క్రైమ్/లీగల్

ట్రాక్టర్ ట్రాలీ కింద పడి యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడుతూరు, జూలై 3:మండల పరిధిలోని చెరుకుచెర్ల గ్రామానికి చెందిన నాగశేషులు కుమారుడు నరేష్(22) మంగళవారం ట్రాక్టర్ ట్రాలీ కింద పడి మృతిచెందాడు. మట్టి లోడ్ వేసుకుని సొంతంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తున్న నరేష్ గ్రామ సమీపంలో రహదారి సరిగా లేకపోవడంతో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడుతుందేమోనని భావించి డ్రైవింగ్ సీటులో నుంచి పక్కకు దూకాడు. అయితే ఆ సమయంలో ట్రాలీ అతడిపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే సీఐ వెంకటరమణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.