క్రైమ్/లీగల్

చిట్టీల పేరుతో భారీ మోసం ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: చిట్టీల పేరుతో ఎంతోమందిని నమ్మించి రూ.2 కోట్ల మొత్తానికి మోసం చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సిసిఎస్ పోలీసులు తెలిపారు. లింగాల విజయమ్మ, ఎక్కుర్తి మనోహర్, మరికొందరు కలిసి చిట్టీల పేరుతో మోసానికి పాల్పడ్డారు. 1995 నుంచి వీరు చిట్టీల వ్యాపారం చేస్తూ సొమ్ము దుర్వినియోగం చేశారు. ప్రజల సొమ్ముతో వీరు స్ధిరాస్తులు కూడగట్టినట్లు సిసిఎస్ అధికారులు గుర్తించారు. సక్కుబాయి, మరో 9 మంది చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిసిఎస్ డిసిపి కార్యాలయం తెలిపింది. ఎసిపి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అదనపు డిసిపి జి.జోగయ్య ఈ కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.