క్రైమ్/లీగల్

చెరువులో మునిగి ఎంబీబీఎస్ విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 7: ఈత కొట్టడానికి స్నేహితులతో కలిసి వెళ్లిన ఎంబీబీఎస్ విద్యార్థి సుమంత్ (19) చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీకి చెందిన సుమంత్ పట్టణంలోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సుమంత్ శనివారం సాయంత్రం తన నలుగురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు పట్టణ సమీపంలోని పాలకొండ చెరువు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి సుమంత్ మృతి చెందాడు. కాగా, మృతుడు మహబూబ్‌నగర్ మున్సిపాల్టీలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే ఉద్యోగి మధు కుమారుడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.