క్రైమ్/లీగల్

విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుద్రంగి, జూలై 7: రుద్రంగి మండల మానాల గ్రామానికి చెందిన తూం గణేశ్(25) అనే యువకుడు విద్యుత్ షాక్‌తో శనివారం మృతి చెందాడు. తన వ్యవసాయ క్షేత్రంలోచెట్టు కొడుతుండగా, కొమ్మలు విద్యుత్ తీగలకు తగిలి షాక్ రాగా, అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతు గణేశ్ విద్యుత్ షాక్‌తో మృతి చెందటంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విద్యాసాగర్‌రావు తెలిపారు.