క్రైమ్/లీగల్

నీట్‌లో 49తప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధురై, జూలై 10: వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం తమిళ భాషలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు ఉపశమనం కలిగించే విధంగా మధురైన హైకోర్టు బెంచి ఆదేశాలు జారీ చేసింది. తమిళంలో ఉన్న నీట్ పరీక్షలో 49 తప్పులు దొర్లాయి. ఒక్కో తప్పుకు 4 మార్కులు చొప్పున మొత్తం 196 మార్కులు కేటాయించాలని హైకోర్టు సీబీఎస్‌ఈని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సీటీ సెల్వం, ఏఎం బషీర్ అహ్మద్‌తో కూడిన మధురై హైకోర్టు బెంచి ఆదేశాలు జారీ చేసింది. తప్పులు సరిదిద్ది మార్కులు కలిపి సవరించిన జాబితాను అప్‌డేట్ చేయాలని సీబీఎస్‌ఈని ఆదేశించారు. అర్హులైన అభ్యర్థుల గురించి కౌనె్సలింగ్ సెంటర్లకు వెళ్లాలని కోర్టు అధికారులను ఆదేశించింది. కాగా ఈ పిటిషన్‌ను సీపీఎం నేత టీకే రంగరాజన్ దాఖలు చేశారు. 49 ప్రశ్నల అనువాదం సరిగా జరగలేదని తప్పులు దొర్లాయని ఆయన కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. నీట్‌లో 180 ప్రశ్నలు ఉంటాయి. వీటి మార్కులు 720. జాతీయ స్థాయిలో వైద్య, దంత వైద్య కళాశాల్లో సీట్లు సాధించేందుకు తమిళంలో నీట్ పరీక్ష రాసిన అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడే విధంగా సీబీఎస్‌ఈ చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. కాగా సీబీఎస్‌ఈ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తుండగా, జాతీయ స్థాయిలో ఇంత ప్రతిష్టాకరమైన పరీక్షను నిర్వహిస్తుండగా, ఏమి జాగ్రత్తలు తీసుకుంటారని కోర్టు నిలదీసింది. ప్రైవేటుగా ప్లస్‌టూ రాసిన అభ్యర్థులకు నీట్ పరీక్షకు ఎందుకు అనుమతించరని హైకోర్టు ప్రశ్నించింది. నీట్ పరిక్షను మే 6వ తేదీన దేశ వ్యాప్తంగా 136 నగరాల్లో 11 భాషల్లో నిర్వహించారు. జూన్ 4వ తేదీన ఫలితాలను ప్రకటించారు. తమళనాడు నుంచి 1.07 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. తమిళనాడులో పది నగరాల్లో 170 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు.