క్రైమ్/లీగల్

యవకుడి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి టౌన్, ఆగస్టు 2: పట్టణంలోని ఇందిరాగర్‌లో నివసిస్తున్న పిరిగి భార్గవ్(20) అనే వ్యక్తిని అతని ఇంటిముందే స్నేహితులు మద్యం మత్తులో తలపై బండతోకొట్టి దారుణంగా హత్యచేసిన సంఘటన గురువారం జరిగింది. రెండవ పట్టణ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరానగర్‌లో ఒక వ్యక్తి చనిపోయి ఉండటాన్ని ఆటోడ్రైవర్లు గమనించి సమాచారం అందించటంతో సంఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే ఆ వ్యక్తి మృతిచెందాడని తెలిపారు. తల్లిదండ్రులు పిరిగి రజనీకాంత్, మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదులో తమ పెద్దకొడుకు భార్గవ్ జీడీ నాయుడు కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడని, బుధవారం కళాశాల నుంచి ఇంటికి వచ్చాక సాయంత్రం స్నేహితులతో బయటకు వెళ్లాడని చెప్పారు. రాత్రి 11.30 ఇంటికి వచ్చిన ఆయన ఇంట్లో నిద్రిస్తున్న తన తల్లిని మిద్దెమీదకు వెళ్లిపడుకోవాలని చెప్పడంతో ఆమె మిద్దెపైకి వెళ్లి పడుకుందన్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతంలో రావటంతో మాట్లాడుకుంటూ బయటకు వెళ్లాడని, తెల్లవారి లేచిచూడగా రక్తం మడుగులో పడి ఉన్నారని తెలిపారన్నారు. మద్యం సేవిస్తున్న సందర్భంలో జరిగిన గొడవల కారణంగా మద్యంమత్తుతో అతని స్నేహితులు హత్యచేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.