క్రైమ్/లీగల్

బస్సుల్లో చోరీకి పాల్పడే అంతర్ రాష్ట్ర ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఆగస్టు 2: ట్రావెల్ బస్సుల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన 8 మంది ముఠా సభ్యులను నెల్లూరు క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను క్రైం బ్రాంచ్ డిఎస్పీ బాలసుందరరావు గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాజిద్, జిసాన్, మొహ్మద్ తాహిర్ మాలిక్, ఫర్జన్ అలీ, మహమ్మద్ అయూబ్, సత్యవీర్‌సింగ్, ఢిల్లీకి చెందిన ఆశిన్ అన్సారీలు ముఠాగా ఏర్పడి ట్రావెల్ బస్సుల్లో సాధారణ ప్రయాణీకుల మాదిరిగా ప్రయాణం చేస్తూ ఎవరూ గమనించకుండా, చాకచక్యంగా తోటి ప్రయాణీకుల బ్యాగులు, ఇతర సామగ్రిని దొంగిలించేవారు. దొంగిలించిన సొత్తును అందరూ ఒకచోట పంచుకొని తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోయేవారు. ఇలా హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, అనంతపురం, చెన్నై, నెల్లూరు తదితరచోట్ల వీరు దొంగతనాలకు పాల్పడ్డారు. వీరిపై ఆయా ప్రాంతాల పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నాయి. వేదాయపాలెం స్టేషన్‌లోనూ వీరిపై ఓ చోరీ కేసు నమోదై ఉంది. ఈ కేసుకు సంబంధించి క్రైం బ్రాంచ్ పోలీసులు, వేదాయపాలెం పోలీసులు వీరిపై నిఘా ఉంచగా గురువారం స్థానిక మాగుంట సర్కిల్ ప్రాంతంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ ఎదుట ఉన్న 8 మంది నిందితులను క్రైం బ్రాంచ్ సిఐ బాజీజాన్‌సైదా, వేదాయపాలెం సిఐ నరసింహారావుల ఆధ్వర్యంలో ఎస్సై షరీఫ్, హెడ్ కానిస్టేబుళ్లు వెంకన్న, ఆర్.సత్యనారాయణ, కె.గిరిధరరావు, సి.విశ్వనాథం, జె.సురేష్‌బాబు, కానిస్టేబుళ్లు సుబ్బారావు, నరేష్, అరుణ్‌కుమార్, పి.విజయప్రసాద్, రాజేష్, సాయి ఆనంద్, దారా వినోద్, టి.రాములు దాడి చేసి పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు రూ.3 లక్షల విలువ చేసే 12 సవర్ల బంగారు గాజులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో డిఎస్పీతో పాటు సిఐలు బాజీజాన్‌సైదా, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.