క్రైమ్/లీగల్

230 కిలోల గంజాయ స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, ఆగస్టు 2: విశాఖ నుంచి మహారాష్టక్రు రవాణా అవుతున్న 230 కిలోల గంజాయితోపాటు వాహనాలను దేవరపల్లి సెంటర్‌లో ఎస్సై పి వాసు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కడియం నుంచి మహారాష్టక్రు పేపరు రవాణా చేయడానికి ఉపయోగించే లారీలో విశాఖ వద్ద 230 కిలోల గంజాయిని 85 బండిళ్లుగా ప్యాక్ చేసి లోడుచేశారు. దేవరపల్లి వద్ద లారీ మరమ్మతులకు గురికావడంతో గంజాయి బండిళ్లను ఒక కారులోకి లోడు చేశారు. దేవరపల్లి పోలీసులకు పక్కా సమాచారం అందడంతో లారీ, కారుతోపాటు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో కొవ్వూరు రూరల్ సీఐ శరత్ రాజ్‌కుమార్, ఎస్సై పి వాసు ఈ వివరాలు తెలిపారు. నిందితుల నుంచి 4లక్షల 2వేల 800 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని, గంజాయి విలువ దాదాపు రూ.30లక్షలు ఉంటుందని తెలిపారు. అలాగే గంజాయి రవాణాకు మధ్యవర్తిగా ఉన్నవారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని వారు తెలిపారు. అదుపులోకి తీసుకున్న ఆరుగురిలో లారీ డ్రైవర్, క్లీనర్ కూడా ఉన్నారని వివరించారు. ఈ గంజాయిని మహారాష్టల్రో శాంగ్లీ తదితర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్టు తెలిపారు.