క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోగిపేట, ఆగస్టు 2: అల్లాదుర్గం మండలం చిల్వర్ గ్రామంలో బుధవారం రాత్రి విద్యుత్ షాక్ తగిలి సంగాగౌడ్(40), మహమ్మద్ శాన్(16) మృతి చెందారు. వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా మామిడి తోటకు వేసిన కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో అనుకోకుండా వీరిద్దరు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.వీరు మృతి చెందిన విషయాన్ని గ్రామస్థులు విద్యుత్, పోలీస్ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలనే మృతి చెందినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు సంఘటన స్థలానికి రాకపోవడంతో రెండు గంటల పాటు 161 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మృతి చెందిన కుటుంభాలను ఆదుకోవాలని కోరారు. సంగాగౌడ్, మహామ్మద్ శాన్ శవాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అల్లాదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.