క్రైమ్/లీగల్

నందిపేటలో యూకేజీ విద్యార్థిని కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట, ఆగస్టు 2: నందిపేట మండల కేంద్రంలోని శ్రీ గీత హైస్కూల్‌లో యూకేజీ చదువుతున్న మహేశ్వరీ అనే 6సంవత్సరాల విద్యార్థిని గురువారం కిడ్నాప్‌కు గురైంది. బాధిత కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వనె్నల్(కే) గ్రామానికి చెందిన హరిత, రమేష్‌ల పెద్ద కుమార్తె అయిన 6సంవత్సరాల వయస్సు గల మహేశ్వరి నందిపేటలోని శ్రీ గీత హైస్కూల్‌లో చదువుతోంది. కాగా, గురువారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని మహిళ పాఠశాలకు వచ్చి మా అక్క కూతురు మహేశ్వరిని పలుకరించి వెళ్తానని నమ్మబలికింది. ఇప్పుడు పంపించడం కుదరదని ఉపాధ్యాయులు అభ్యంతరం తెలిపారు. అక్కడే పాఠశాల వద్ద రెక్కీ నిర్వహించిన మహిళా, మధ్యాహ్న భోజన సమయంలో బాలిక మహేశ్వరీ బయటకు రాగానే చాక్లెట్లు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లింది. అనంతరం విద్యార్థిని మల్లేశ్వరీ పాఠశాలలో కనిపించకపోవడంతో వెంటనే అనుమానం కలిగిన ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు లబోదిబోమంటూ పాఠశాలకు చేరుకుని, తమ కూతురు ఏమైందంటూ యాజమాన్యాన్ని నిలదీశారు. ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి తాను మహేశ్వరి పెద్దమ్మను అని చెప్పినా, మహేశ్వరిని కలవడం వీలుకాదని తేల్చి చెప్పడం జరిగిందని, భోజన సమయం నుండి మహేశ్వరి కనిపించకపోవడంతో వెంటనే మీకు సమాచారం ఇచ్చామని యాజమాన్యం తల్లిదండ్రులకు విరించింది. ఇదిలాఉండగా, బాలిక తండ్రి రమేష్ కొంతకాలంగా ఆర్మూర్ మండలం మచ్చెర్లలో మీసేవ నిర్వహిస్తున్నాడు. అదే గ్రామంలో రజిత అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమెను ఓ పాపకు తల్లిని చేశాడు. ఈ విషయంలో భార్యభర్తల మధ్య గొడవలు జరుగడం, రమేష్ మచ్చర్లలోని యువతి వద్దకు వెళ్లకపోవడంతో విబేధాలు తలెత్తాయి. దీంతో కక్షగట్టిన రజిత తన కూతురును కిడ్నాట్ చేసిందంటూ బాలిక తల్లిదండ్రులు హరిత, రమేష్‌లు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు.