క్రైమ్/లీగల్

ఆర్టీసీ డ్రైవర్‌కు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 2: రోడ్డు ప్రమాదానికి కారకుడైన ఆర్టీసీ డ్రైవర్‌కు 12వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రూ.వెయ్యి జరిమానా విధించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ఉంగుటూరు మండలం ఎలుకపాడుకు చెందిన మొవ్వ ఏస్తేరు రాణి (15) అనే బాలిక 2017 జూన్ 21న సైకిల్‌పై స్కూలుకు వెళ్తుండగా ఉంగటూరు వైపు వెళ్లే గన్నవరం డిపో బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బాలిక గాయపడగా కేసు నమోదు చేసిన ఉంగుటూరు పోలీసులు మాచవరానికి చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కంబర సంజీవ (37)ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరుఫున పోలీసులు ప్రవేశపెట్టిన 8మంది సాక్షులను విచారించగా నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.
టాటా ఏస్ డ్రైవర్‌కు..
ఉంగుటూరు మండలం మానికొండ గ్రామానికి చెందిన తిరువీధి రాజేష్, అతని బావ జవ్వనపూడి కిరణ్‌కుమార్ కలిసి బైక్‌పై వెళ్తుండగా 2017 జనవరి 17న నందమూరు ఇటుకల బట్టీ వద్దకు వచ్చే సరికి టాటా ఏస్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వాహన డ్రైవర్ గుడివాడకు చెందిన ముక్కా నాగేశ్వరరావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరుఫున తొమ్మిది మంది సాక్షులను విచారించగా నిందితునిపై నేరం రుజువుకావడంతో 12వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి రూ.వెయ్యి జరిమానా విధించారు.