క్రైమ్/లీగల్

హదియా వివాహం రద్దు సబబేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఒక మహిళ వివాహాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సమర్ధనీయమేనా, అందుకు మీకున్న అధికారాలు ఏమిటో పరిశీలించారా అని కేరళ హైకోర్టును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘లవ్ జిహాదీ’ కేసులో బాధితురాలిగా చెబుతున్న ఒక మేజర్ మహిళను విచారణ కోసం వేర్వేరు ప్రాంతాలకు తరలించేలా ఉత్తర్వులు ఇవ్వడం న్యాయబద్ధమేనా?, ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా చేసుకున్న వివాహంపై అలా ఎలా చేస్తారని కూడా నిలదీసింది. 25 ఏళ్ల హదియా వివాహం రద్దు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె తండ్రి అశోకన్ సమర్ధించగా దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఇద్దరు మేజర్లు చేసుకున్న వివాహాన్ని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించింది. ‘ఇద్దరు పెద్దవాళ్లు (మేజర్లు) ఇష్టపూర్వకంగా చేసుకున్న వివాహం న్యాయబద్ధం కాదని కోర్టు చెప్పగలదా? ఆమె తనకు తగిన వ్యక్తిని వివాహం చేసుకుందా లేదా ఆమె ప్రయోజనాలను నెరవేర్చే వివాహమేనా అన్నది మేం చెప్పలేం. తనకు నచ్చినవాడిని తన ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నానని మా వద్దకు వచ్చి ఆమె చెప్పింది.’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.
ఇస్లాం మతం స్వీకరించిన హిందూ యువతి తన పేరును హదియాగా మార్చుకుని జహాన్ అనే యువకుడిని వివాహం చేసుకోగా బలవంతంగా ఆమెను మతం మార్చి వివాహం చేశారని, ఇది ‘లవ్‌జిహాదీ’ వ్యవహారమని ఆమె తండ్రి కేరళ హైకోర్టును ఆశ్రయించగా ఆ వివాహాన్ని రద్దు చేసింది. దీనిపై జహాన్ అప్పీల్ చేశారు. హదియా తండ్రి అశోకన్ తరపున వాదిస్తున్న న్యాయవాది శ్యామ్ దివన్ తన వాదన వినిపిస్తూ రాజ్యాంగంలోని 226వ నిబంధన ప్రకారం వాస్తవాలు, పరిస్థితులను బేరీజు వేసిన హైకోర్టు తన అధికారాల మేరకు వివాహాన్ని రద్దు చేయడం సమర్ధనీయమేనని అన్నారు. కేరళలో యువతులను సిరియావంటి ప్రాంతాలకు సెక్స్ బానిసలుగా విక్రయించే ముఠా ఈ లవ్‌జిహాదీ తరహా వివాహాలను చేస్తోందని ఆరోపించిన దివన్ హైకోర్టు నిర్ణయం అలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసేదిగా ఉందన్నారు. ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం ‘ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామని చెబుతున్నప్పుడు మళ్లీ వారు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అని అడగడంలో అర్థం ఏముందని, 226 నిబంధన ప్రకారం వివాహం రద్దు చేయడం, మళ్లీ విచారణ పేరుతో కోర్టులకు దూరంగా ఉంచడం సబబేనా? ఇది న్యాయానికి సంబంధించిన సవాలే’ వ్యాఖ్యానించింది. హదియా, ఆమె తండ్రి మధ్య జరిగిన సంభాషణల రికార్డులను దివన్ కోర్టు ముందుంచారు. కాగా ‘వివాహం, విచారణ అనేవి రెండూ వేర్వేరు అంశాలు. వివాహానికి సంబంధించినంతవరకు దర్యాప్తు కోసం వారంట్ జారీ చేయలేం. పెళ్లిని వివాచరించలేం. ఇంకే విషయంపైనైనా విచారణ జరుపుకోవచ్చు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.